Share News

కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:45 PM

మండలంలోని మురడి గ్రామపంచాయతీ తమ్మేపల్లి గ్రామంలో వీధికుక్కలు దాడిలో 15 గొర్రెలు మరణించాయి.

కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి
గొర్రెల కళేబరాలు

డీ.హీరేహాళ్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని మురడి గ్రామపంచాయతీ తమ్మేపల్లి గ్రామంలో వీధికుక్కలు దాడిలో 15 గొర్రెలు మరణించాయి. రైతు జయరాం గ్రామ సమీపంలోనే దొడ్డిని ఏర్పాటు చేసుకొని.. గొర్రెలను పెంచుకునేవాడు. బుధవారం ఉదయం వీధికుక్కలు గొర్రెలమందపై దాడికి తెగపడ్డాయి. దీంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మరణించాయి. దీంతో తనకు సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.

Updated Date - Jan 21 , 2026 | 11:45 PM