Share News

MLA DAGGUPATI: ప్రజాసమస్యలు జవాబుదారీతనంతో పరిష్కారం

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:01 AM

ప్రజా సమస్యలపై ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. గురువారం అర్బన కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. పలు కాలనీల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన అర్జీలు స్వీకరించారు.

MLA DAGGUPATI: ప్రజాసమస్యలు జవాబుదారీతనంతో పరిష్కారం
MLA Daggupati receiving petitions from the people

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. గురువారం అర్బన కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. పలు కాలనీల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన అర్జీలు స్వీకరించారు. చాలా మంది పింఛన్లు, రేషనకార్డులు, స్థానిక కాలనీల్లోని ఇతర సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన కార్పొరేషన అధికారులను, వార్డు సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు. అధికారులు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తన దృష్టికి తేవాలన్నారు. ప్రజాదర్బార్‌లో వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించాలన్నారు. కొత్త పింఛన్లు, రేషనకార్డులపై ప్రజలు ఆందోళన చెందవద్దని, త్వరలోనే వాటిని మంజూరుచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - Apr 17 , 2026 | 12:01 AM