నావైపు అంతా క్లియర్
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:31 AM
రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చర్చించారు.
క్యాబినెట్ ఆమోదమే తరువాయి
‘అమరావతి’పై వెంకయ్యతో అమిత్ షా
న్యూఢిల్లీ, మార్చి 29(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చర్చించారు. ఆదివారం, ఆయన ఆ వివరాలను ‘ఆంధ్రజ్యోతి’కి ఫోనులో తెలిపారు. ‘రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి నా శాఖ నుంచి అన్నీ క్లియర్ అయ్యాయి. క్యాబినెట్‌లో పెట్టి ఆమోదించడం ఒక్కటే మిగిలింది’ అని అమిత్ షా పేర్కొన్నారని వెంకయ్య చెప్పారు. ‘రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి ఆమోదించేలా చూడండి. భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడండి’ అని అమిత్ షాను కోరినట్లు వెంకయ్య తెలిపారు. తాను చేసిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మాజీ ఉప రాష్ట్రపతి చెప్పారు.