Share News

ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:50 AM

అమరావతికి చట్టబద్ధత బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దేశంలో ఉన్న అన్ని పార్టీల‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమ‌రావ‌తికి చట్టబద్ధత క‌ల్పించిన ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల త‌ర‌ఫున ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు
Amaravati legal status

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న(బుధవారం) లోక్‌సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. ఈ రోజు (గురువారం) బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రాజ్యసభలో బిల్లుపై చర్చ జరగనుంది.


ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు

అమరావతికి చట్టబద్ధత బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయిన అమ‌రావ‌తికి చ‌ట్టబద్ధత క‌ల్పించే బిల్లుకు పూర్తి మెజార్జీతో లోక్‌సభలో ఆమోదం ల‌భించ‌డానికి కృషి చేసిన ప్రధాని మోదీకి లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం ఉదయం పార్లమెంట్ హాలులో మంత్రి లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దేశంలో ఉన్న అన్ని పార్టీల‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమ‌రావ‌తికి చట్టబద్ధత క‌ల్పించిన ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల త‌ర‌ఫున ధన్యవాదాలు తెలిపారు.


లోక్‌స‌భ‌లో బిల్లు ఆమోదం పొందిన వెంట‌నే మంత్రి నారా లోకేశ్ ఆగ‌మేఘాల‌పై ఢిల్లీ వెళ్లారు. కూట‌మి పార్టీ ఎంపీల‌ను అభినందించారు. ఈ రోజు ఉద‌యం ప్రధానమంత్రి మోదీని క‌లిసి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి చూపిన నిబ‌ద్ధతను మంత్రి లోకేశ్ ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి

మీ మాటలను ఎవ్వరూ లెక్కచేయడం లేదా? అసలు కారణాలు ఇవే!

ఈ యుద్ధం వల్ల ప్రయోజనమేంటి.. అమెరికా ప్రజలకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ..

Updated Date - Apr 02 , 2026 | 12:22 PM