Share News

ఏసీబీకి చిక్కిన అల్లూరి డీఆర్‌వో

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:55 AM

ఉద్యోగి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం...

ఏసీబీకి చిక్కిన అల్లూరి డీఆర్‌వో

పాడేరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం... రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి సంబంధించిన సర్వీస్‌ వ్యవహారాన్ని చక్కదిద్దడంతోపాటు, బకాయిలు రూ.17 లక్షల బిల్లులను పాస్‌ చేసేందుకు డీఆర్‌వో లోకేశ్వరరావు రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో సదరు ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయుంచారు. బుధవారం సాయంత్రం తన చాంబర్‌లో డీఆర్‌వో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Sep 24 , 2026 | 06:55 AM