వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి కోర్టుకు హాజరు
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:22 AM
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చారు.

తదుపరి విచారణ 30కి వాయిదా
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చారు. ఆయనతో పాటు తండ్రి భాస్కర్ రెడ్డి సహా అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులందరూ విచారణకు హాజరయ్యారు. తమపై మోపిన అభియోగాలను నిందితులంతా తిరస్కరించడంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానందరెడ్డిని 2019లో కొందరు హత్య చేశారు. అతడి కుమార్తె సునీతారెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతోంది.