Share News

YouTube CEO Arrested: సర్వేయర్‌ నుంచి రూ.2లక్షల లంచం డిమాండ్‌

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:40 AM

నార్సింగ్‌ తహసీల్‌ లైసెన్సుడ్‌ సర్వేయర్‌ శ్రీకాంత్‌ను రూ.2 లక్షలు డిమాండ్‌ చేసిన చరణ్‌..

YouTube CEO Arrested: సర్వేయర్‌ నుంచి రూ.2లక్షల లంచం డిమాండ్‌

  • యూట్యూబ్‌ చానెల్‌ సీఈవో కటకటాల పాలు

నిజాంపేట, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): నార్సింగ్‌ తహసీల్‌ లైసెన్సుడ్‌ సర్వేయర్‌ శ్రీకాంత్‌ను రూ.2 లక్షలు డిమాండ్‌ చేసిన చరణ్‌ యూ-ట్యూబ్‌ చానెల్‌ సీఈఓ లింగంగౌడ్‌ చివరకు కటకటాల పాలయ్యాడు. ‘సర్వేయర్‌ అక్రమాలు’ అనే శీర్షిక సదరు యూ-ట్యూబ్‌ చానెల్‌లో వార్త ప్రసారమైంది. తర్వాత ఈ కథనంపై మాట్లాడాలని ఐదు రోజుల క్రితం సదరు సర్వేయర్‌ను మెదక్‌కు పిలిపించుకుని తనకు రూ.2 లక్షలివ్వాలని డిమాండ్‌ చేశాడు. అతడి వద్దనున్న 7 గ్రాముల బంగారం, రూ.10 వేల నగదు బలవంతంగా లాక్కోవడంతోపాటు మరిన్ని డబ్బుల కోసం వేధించాడు. దీంతో సర్వేయర్‌ శ్రీకాంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లింగం గౌడ్‌పై రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్‌ కేసు నమోదు చేశారు. లింగంగౌడ్‌ను సోమవారం సాయంత్రం అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు పంపించారు.

Updated Date - Aug 12 , 2025 | 06:40 AM