యువత సన్మార్గాన్ని ఎంచుకోవాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:08 AM
భవిష్యత్తు బాగుండాలం టే యువత సన్మార్గాన్ని ఎంచుకోవాలని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి అ న్నారు.

యువత సన్మార్గాన్ని ఎంచుకోవాలి
నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి
నార్కట్‌పల్లి, తిప్పర్తి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు బాగుండాలం టే యువత సన్మార్గాన్ని ఎంచుకోవాలని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి అ న్నారు. ఎస్పీ శరతచంద్రపవార్ ఆదేశాల మేరకు మిషన పరివర్తనలో భాగంగా పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని పలు మండలా ల్లో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీతో పాటు ప లువురు సీఐలు మాట్లాడుతూ మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని కష్టపడు తూ మిమ్మల్ని చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని యువత కు సూచించారు. కానీ కొందరు యువకులు చెడు స్నేహాల కారణంగా పెడదారి పడుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థు ల్లో క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చాలనే సంకల్పంతో ఎస్పీ మిషన పరివర్తన కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. యువత చెడు మార్గాలను వెళ్లకుండా ఉండాలని సూ చించారు. యువత ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాని కోసం శ్రమించాలని సూచించారు.
నార్కట్‌పల్లిలోని జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన మండలస్థాయి కబడ్డీ పోటీలను డీఎస్పీ శివరాంరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో నార్కట్‌పల్లి సీఐ, ఎస్‌ఐలు నాగరాజు, క్రాంతికుమార్, పాఠశాల హెచఎం రాములు తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలలో కబడ్డీ పోటీలను డీఎస్పీ శివరాంరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. కార్యక్రమంలో సీఐ నాగరాజు, ఎస్‌ఐ ధర్మా పాల్గొన్నారు.