యువతకు ఆటాపాట అవసరం
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:31 PM
యువత పెడదోవ పట్టకుండా విద్యతో పాటు ఆరోగ్యం, ఆట, పాట అవసరమని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

- ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
- అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం
పెద్దకొత్తపల్లి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : యువత పెడదోవ పట్టకుండా విద్యతో పాటు ఆరోగ్యం, ఆట, పాట అవసరమని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మండలంలోని దేవునితిర్మలాపూర్ గ్రామంలో శ్రీభూనిల సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్రాష్ట్ర కబడ్డీ, మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీల విజేతలకు బుధవారం అర్ధరాత్రి మంత్రి బహు మతులను ప్రదానం చేశారు. అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల్లో మొదటి బహుమతి ప్రకాశ్ మిషన్-గుం టూరు జట్టుకు రూ.50వేలు, రెండవ బహుమతి రూ.40వేలు కాసాని అకాడమీ-హైదరాబాద్, తృ తీయ బహుమతి రూ.30వేలు పెబ్బేరు మండ లం కంచిరావుపల్లి జట్టు, నాల్గవ బహుమతి రూ.20వేలు అలాగే మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీల జట్ల విజేతలకు మంత్రి చెక్కు లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఆటలే కాదు చదువులోనూ జీవితంలోనూ ఓటమి చెందామ ని నిరాశ నిస్పృహలకు గురి కావద్దని, ఓటమి విజయానికి నాందీ కావాలన్నారు. దేవాలయం అభివృద్ధి కోసం రూ.కోటి మంజూరు చేయనున్న ట్లు మంత్రి ప్రకటించారు. క్రీడలను నిర్వాహణ దాత మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్, మాజీ సర్పంచ్ సత్యం, మాజీ ఎంపీటీసీ ప్రతాప్ రెడ్డిలను శాలువా కప్పి మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చింతల పల్లి జగదీశ్వర్‌రావు, గుమ్మకొండ రమేష్, మాజీ ఎంపీపీ వేంకటేశ్వర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ విష్ణు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, వైఎస్ చైర్మన్ మెరుగు రాజు, మాజీ చైర్మన్లు బాలస్వామి, గోపాల్‌రావు తదిత రులు పాల్గొన్నారు.