Dowry Harassment: అడిగినంత డబ్బిచ్చి నన్ను పెళ్లి చేసుకో
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:26 AM
ప్రేమించానన్నాడు.. జీవితాంతం ఆనందంగా చూసుకుంటానని మాటిచ్చాడు. అతడిని నమ్మి పెళ్లి చేసుకోమని కోరగా తనకు డబ్బు కావాలన్నాడు. లేదంటే తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను
ప్రియుడి వేధింపులతో యువతి ఆత్మహత్య
మంచిర్యాల క్రైం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రేమించానన్నాడు.. జీవితాంతం ఆనందంగా చూసుకుంటానని మాటిచ్చాడు. అతడిని నమ్మి పెళ్లి చేసుకోమని కోరగా తనకు డబ్బు కావాలన్నాడు. లేదంటే తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను బయటపెడతానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాలకు చెందిన ఓ యువతి(23) అదే ఊరిలో డిగ్రీ చదువుకునే రోజుల్లో తన కళాశాలకే చెందిన రంగుల శ్రీకాంత్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఈక్రమంలో యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత ఫోన్ చేసి కట్నకానుకలు ఇస్తే ఇంట్లో వారు పెళ్లికి ఒప్పుకుంటారంటూ చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్‌తో పాటు అతని తల్లి రాజేశ్వరి, తండ్రి కిష్టయ్య, సోదరుడు రమేశ్ యువతితో మాట్లాడి డబ్బులు ఇస్తేనే వివాహం జరుగుతుందని, అలాకాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటే, తమ వద్ద ఉన్న ఫొటోలు బయటపెడతామంటూ ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.