Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేయాలి

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:41 PM

పద విలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కా రం కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేయాలి
చైర్మన్‌ సత్యం, వైస్‌ చైర్మన్‌ షాహెద్‌, కౌన్సిల్‌ సభ్యులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

- చివరి మునిసిపల్‌ సమావేశంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : పద విలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కా రం కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నిజాయితీగా పని చేస్తే ప్రజల్లో తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని మునిసిపల్‌ సమావేశ మందిరంలో పురపాలక సంఘం చివరి సాధారణ సమావేశం చైర్మన్‌ ఎడ్మ సత్యం అధ్యక్షతన జరిగింది. ఈ సమావే శానికి కల్వకుర్తి కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కల్వ కుర్తిని అభివృద్ధిలో అగ్రగ్రామిగా నిలిపేందుకు ప్రభుత్వం నుంచి తగిన నిధులు సమకూర్చేం దుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపా రు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా సూదిని జైపాల్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, చిత్తరంజన్‌దాస్‌లు నిజాయితీగా పని చేసి తగిన గుర్తింపు తెచ్చుకు న్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం చైర్మన్‌ ఎడ్మ సత్యం, వైస్‌ చైర్మన్‌ షాహెద్‌, కౌన్సిల్‌ స భ్యులను ఎమ్మెల్యే నారాయణరెడ్డి శాలువాలు, మెమెంటోలతో సన్మానించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ షాహెద్‌, మునిసిపల్‌ కమిషనర్‌ మహమ్మద్‌ షేక్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ రాచోటి శ్రీశైలం, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు ఉన్నారు.

ఫ వెల్దండ : పెద్దాపూర్‌ గ్రామపంచాయతీలోని తుంకిబండతండాకు చెందిన వడ్త్యావత్‌ కిషన్‌నాయక్‌ అనారోగ్యం పాలవగా, చికిత్స నిమిత్తం మంజూరైన రూ.46వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును శనివారం ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి బాధితుని కుటుంబీకులకు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ డైరెక్టర్‌ కేశమళ్ల కృష్ణ, వడ్డెరసంఘం నియోజకవర్గ అధ్యక్షుడు వరికుప్పల ఆంజనేయులు, అంబేడ్కర్‌ యువజనసంఘం అధ్యక్షుడు కేశమళ్ల చంద్రశేఖర్‌, నాయకులు అనిల్‌, మహేష్‌, నందు, రఘు ఉన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:41 PM