Share News

బిల్లులు రాక పనులు నిలిచి..

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:13 AM

ప్రభుత్వ పాఠశాలలను సకల హంగులతో తీర్చిదిద్దాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం లో శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించడం, మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.

 బిల్లులు రాక పనులు నిలిచి..
గుర్రంపోడులో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణం

బిల్లులు రాక పనులు నిలిచి..

సంపూర్తిగా మనఊరు - మనబడి

బిల్లులు రాక పనులు నిలిపి వేసిన కాంట్రాక్టర్లు

గుర్రంపోడు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను సకల హంగులతో తీర్చిదిద్దాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం లో శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించడం, మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు కూడా ఈ పథకం మంజూరైంది. పాఠశాలలో నెలకొన్న గదుల కొరత తీవ్ర సమస్యగా మా రింది. ఆ పథకం కింద శిథిలావస్థలో ఉన్న పా ఠశాల భవనం తొలగించి నూతన నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరయ్యాయి. దీంతో గతేడా ది పనులు ప్రారంభించగా స్లాబ్‌ స్థాయిలోనే పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌కు బిల్లు లు రాకపోవడంతో పనులు ముందుకు సాగలే దు. ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన బడి పనులు నిలిచిపోయాయి. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా అందక అధికారు లు చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద పలు పాఠశాలలకు మౌలిక వసతులను కల్పిస్తున్నా మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులను మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం పాఠశాలలో ని 40మంది విద్యార్థులకు గాలి, వెలుతురు లే ని గదిలో బోధన కష్టతరంగా మారింది. భవన నిర్మాణాన్ని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పలు పాఠశాలల్లో నిలిచిన పనులు

మండలంలోని కట్టవారిగూడెం పాఠశాలలో శిథిలావస్థకు చేరిన తరగతి గదిని తొలగించారు. మన ఊరు మన బడి క్రింద నూతన భవన నిర్మాణాన్ని చేపట్టారు. స్లాబ్‌ వేయగా గోడలు నిర్మించాల్సి ఉంది. పాఠశాల యాజమాన్య కమిటీకి కేవలం రూ.70వేల బిల్లు మాత్రమే చెల్లించగా మరో పది లక్షల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. టాయిలెట్లు మంచినీటి సౌకర్యం తదితర నిర్మాణాలకు సంబంధించి బిల్లులు రావాల్సి ఉంది. చామలేడు పాఠశాలలో రెండు తరగతి గదులు మరమ్మతులకు సంబంధించి బిల్లులు కోసం రెండేళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద కొత్తగా పాఠశాలలకు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు చేపడుతున్నా గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన బడి పథకం కింద బిల్లులు మాత్రం అందించడం లేదు.

రెండేళ్లుగా బిల్లుల కోసం ఎదురుచూస్తున్నా

చామలేడు ప్రాథమిక పాఠశాలలో బిల్లులు వెంటవెంటనే ఇప్పిస్తామని అప్పటి అధికారులు చెప్పడంతో పనులు చేశాం. అప్పులు చేసి పనులు చేశా. రూ.5లక్షల బిల్లు రావాల్సి ఉంది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు ఎప్పుడిస్తారో చెప్పడం లేదు.

శంకర్‌,ఎస్‌ఎంసీ మాజీ చైర్మన,చామలేడు

బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి

మన ఊరు మనబడి కార్యక్రమంలో చేసిన పనులకు సం బంధించి బిల్లులు పెండింగ్‌ లో ఉన్న మాట వాస్తవమే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. చేసిన పనులకు సంబంధించి గతంలో ఉన్న అధికారులు ప్రతిపాదనలు పంపించారు.త్వరలోనే బిల్లులు వస్తాయని ఆశిస్తున్నాం.

యాదగిరి, మండల విద్యాధికారి

Updated Date - Jan 07 , 2025 | 01:13 AM