చాకిరే.. చిల్లిగవ్వ ఇవ్వలే..
ABN , Publish Date - Feb 21 , 2025 | 11:56 PM
అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహనలో బూత్ స్థాయి అధికారి(బీఎల్వో) పాత్ర ఎంతో కీలకమైనది. ఓటరు జాబితోలో మార్పులు, చేర్పులు, దరఖాస్తుల స్వీకరణ, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల ఏర్పాట్ల పరిశీలనతోపాటు పోలింగ్ టైంలోనూ బీఎల్వోలు విధులు నిర్వర్థిస్తుంటారు.
భృతికోసం బీఎల్‌వోల ఎదురు చూపులు
రెండేళ్లుగా చెల్లించని ప్రభుత్వం
జిల్లాలో 865మంది బీఎల్వోలు
సుమారు రూ. 77.85లక్షల బకాయి
తరిగొప్పుల, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహనలో బూత్ స్థాయి అధికారి(బీఎల్వో) పాత్ర ఎంతో కీలకమైనది. ఓటరు జాబితోలో మార్పులు, చేర్పులు, దరఖాస్తుల స్వీకరణ, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల ఏర్పాట్ల పరిశీలనతోపాటు పోలింగ్ టైంలోనూ బీఎల్వోలు విధులు నిర్వర్థిస్తుంటారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోను ఎక్కడైనా సరే బీఎల్వోలుగా అంగన్‌వాడీ టీచర్లు, కారోబార్లు, ఆశవర్కలనే అధికారులు బీఎల్వోలుగా ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 865మంది బీఎల్వోలు(బూత్ స్థాయి అధికారి)గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు బీఎల్వోలుగా పనిచేసినందుకు, సమగ్ర కుటుంబ సర్వే చేసినందుకు గాను ప్రభుత్వం ఇస్తామని చెప్పిన గౌరవ భృతి ఇప్పటికీ ఇవ్వలేదు. 18 నెలలకు సంబంధించి సుమారు రూ.77.85లక్షలు చెల్లించకుండా వివక్ష చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదనపు బాధ్యతలే ఎక్కవ...
ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలు నిరంతరం కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాలను సేకరించారు. గతేడాది ప్రజా పాలన సర్వే, ఆ తర్వాత ఓటరు జాబితా సరవరణ, ఎంపీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, ఓటరు చీటీల పంపిణీతోపాటు పోలింగ్ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 865 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రానికి ఒకరు చొప్పున బీఎల్వోగా పనిచేస్తున్నారు. వీరికి వారి డిపార్టుమెంట్ పనులకంటే ఈ ఎన్నికల నిర్వహాన అధనపు బాధ్యతలే ఎక్కవ.
రెండేళ్లుగా ఒక్కపైసా చెల్లించలే..
అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గతంలో నెలకు రూ. 500 చొప్పున గౌరవ భృతిగా వారి ఖాతాలో జమచేసేవారు. సుమారుగా మూడేళ్లుగా ఈ మెత్తం నిలిచిపోయింది. గత 20 రోజుల క్రితం ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలకు సంబందించిన నగదును మాత్రమే చెల్లించింది. 18 నెలలకు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న బీఎల్వోలకు రావాల్సిన సుమారు రూ. 77.85లక్షలు గౌవర భృతి చెల్లించకుండా వివక్ష చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్చి 31లోపు చెల్లింపులు పూర్తి చేస్తాం...
- రోహిత్ సింగ్, అదనపు కలెక్టర్, జనగామ
బీఎల్వోగా బూతు స్థాయిలో పనిచే సిన అంగన్‌వాడీ టీచర్లుకు, ఆశ వర్క ర్లకు, పంచాయతీ సిబ్బందికి ప్రతీ మూడు నెలలకు ఓ సారి భృతిని చెల్లించాల్సి ఉంటుంది. మూడు సంవ త్సరాలుగా చెల్లించలేదు అనేది అవాస్తవం. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ వరకు వారికి రావాల్సిన భృతి రిలీజ్ అయ్యి డిస్ట్రిక్ట్ ట్రెజరీలో జమ అయ్యింది. మార్చి 31లోపు వారి ఖాతాల్లో జమ చేస్తాం. మిగత నెలలకు సంబంధిం చిన పెండింగ్ అమౌంట్ రిలీజ్ అయ్యేందు కు చేయా ల్సిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశాం.
బీఎల్వోల భృతిని వెంటనే ఇవ్వాలి..
- ములుగు రాంనారాయణ, బీఎల్వో, బొంతగట్టునాగారం
బీఎల్వోలుగా డ్యూటీ చేసిన పంచాయతీ కార్మికులకు, అంగన్‌వాడీ టీచర్లకు, ఆశవర్కర్లకుపై ఆఫీసర్లు చెప్పిన విధంగా డబ్బులివ్వాలి. అన్ని రకాలుగా కలుపుకుని ఒక్కో బీఎవ్వోకు ఇప్పటి వరకు రూ.12వేల వరకు నగదు రావాల్సి ఉంది. డబ్బులు వెంటనే అందేలాపై అధికారులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎల్వోగా విధులను బహిష్కరిస్తాం.