Share News

మహిళలు సంఘటితంగా ఎదగాలి

ABN , Publish Date - Feb 19 , 2025 | 11:34 PM

మహిళలు అన్ని రంగాల్లో సంఘటితంగా ఉన్న త స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే డాక్టర్‌ కూచ కుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు.

మహిళలు సంఘటితంగా ఎదగాలి
స్వయం సహాయక సంఘాల సభ్యులతో మహిళా శక్తి క్యాంటిన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్‌ రెడ్డి

- ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌ రెడ్డి

బిజినేపల్లి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : మహిళలు అన్ని రంగాల్లో సంఘటితంగా ఉన్న త స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే డాక్టర్‌ కూచ కుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథకం భవనంలో మహిళా శక్తి క్యాంటిన్‌ను బుధవారం రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించి మాట్లాడారు. మహిళలు సమా జంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలోపేతం కావడానికి ఇలాంటి స్వయం సహా యక మహిళా సంఘాల సభ్యులు స్వశక్తితో చేపట్టే వ్యాపారాలు, సేవా కార్యక్రమాలు దోహ దపడుతాయని అన్నారు. ఆయన వెంట ఐకేపీ ఏపీడీ లక్ష్మీనరసింహ, ఏపీఎం విజయ, తహసీ ల్దారు శ్రీరాములు, ఎంపీడీవో కతలప్ప, మహి ళా సమాఖ్య అధ్యక్షురాలు తిరుపతమ్మ, కాంగ్రె స్‌ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు మిద్దె మల్లేష్‌, మాజీ స ర్పంచులు అవంతి శంకర్‌, తిరుపతయ్య, రాం చందర్‌, మిద్దె శ్రీశైలం, గోవిందు నాయక్‌, మా జీ ఎంపీటీసీ ఆంజనేయులు, మహిళా సమాఖ్య సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

శివస్వాములకు మెడికల్‌ క్యాంపు

కందనూలు : జిల్లా కేంద్రంలోని ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధీ, శాహీస్తా న్యూ లైఫ్‌ హాస్పిటల్‌ వారి సంయుక్త ఆధ్వర్యంలో నా గర్‌కర్నూల్‌ మైనార్టీ యూత్‌ సహకారంతో పాద యాత్ర ద్వారా శ్రీశైలం వెళ్తున్న శివస్వాముల కోసం మెడికల్‌ క్యాంపు, పండ్లు, పానీయాలు, అల్పాహారం వితరణ కార్యక్రమాన్ని బుధవా రం ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి ప్రారంభిం చారు. అనంతరం శివస్వాములకు ట్యాబ్లెట్స్‌, పండ్లు, జ్యూస్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కావలి శ్రీను, తీగల సునేంద్ర, నిజాం, జక్కా రాజు, మైనార్టీలు పాల్గొన్నారు.

ఫ నాగర్‌కర్నూల్‌ మండల పరిధిలోని మంతటి చౌరస్తాలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతిలో మంగళవారం ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఈశ్వర్‌రెడ్డి, కొండ నగేష్‌, పాపి రెడ్డి, శివాజీ యూత్‌ సభ్యులు, మంతటి గ్రామ స్థులు పాల్గొన్నారు.

ఫ తెలకపల్లి : ఆధ్యాత్మికతతోనే శాంతియు త ప్రశాంతమైన జీవనం సాధ్యమని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని శివాలయంలో శివస్వా ముల ఇరుముడి కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొని పూజలు నిర్వహించారు. సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ మామిళ్లపల్లి యాదయ్య, టౌన్‌ అధ్యక్షుడు వారణాసి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీలు, శివస్వాములు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2025 | 11:34 PM