Share News

సోలార్‌ ప్లాంట్లతో మహిళా సాధికారత

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:02 AM

మహిళా సాధికారతను పెంపొందించడం కోసమే సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు ఏ ర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శే ఖర్‌రెడ్డి అన్నారు.

 సోలార్‌ ప్లాంట్లతో మహిళా సాధికారత

సోలార్‌ ప్లాంట్లతో మహిళా సాధికారత

డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి

మర్రిగూడ, గట్టుప్పల్‌, చండూరురూరల్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతను పెంపొందించడం కోసమే సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు ఏ ర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శే ఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఖుదాభక్ష్‌పల్లి, దా మెర బీమనపల్లి, శివన్నగూడ, మర్రిగూడ గ్రామాల్లో శుక్రవారం సోలార్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ పీడీ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళా సంఘాలను మెరుగుపర్చేందు కు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మండలంలోని ఈ గ్రామాల్లో ఒక్కొక్క యూనిట్‌కు నాలుగు ఎకరాల భూమిని పవర్‌ప్లాంట్‌ అనుకూలంగా ఉండే విధంగా సేకరించనున్నట్లు తెలిపారు. అనంతరం ఖుదాభక్ష్‌పల్లి మహిళా సంఘాలతో మాట్లాడుతూ స్త్రీ నిధి ద్వారా రుణాలు తీసుకున్నటు వంటి మహిళా సంఘాల ద్వారా రికవరీ చేసి మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చే విధంగా చూడాలని అన్నారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్‌ తారక్‌రామన, పాండు రంగారావు, ఏపీఎం ప్రభాకర్‌, సీసీలు కిషన, శ్రీశైలం, మహిళా సంఘాలు తదితరులు ఉన్నారు.

గట్టుప్పల్‌ గ్రామంలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి మహిళా సంఘాల సభ్యులతో ప్రభుత్వ భూములను డీఆర్‌డీవో పీడీ శేఖర్‌రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఆర్‌ఈడీసీవో డైరెక్టర్‌ పాండురంగారావు, తహసీల్దార్‌ రాములు, ఎంపీడీవో మాధవరెడ్డి, ఏఈ ప్రవీణ్‌రెడ్డి, సర్వేయర్‌ జైహింద్‌, ఏపీఎం పుల్లయ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కె. శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

చండూరు మండలంలోని కస్తాల, పుల్లెంల గ్రామాలలోని ప్ర భుత్వ భూములను డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘ బంధాల సమ న్వయంతో సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ యన వెంట రెడ్కో జిల్లా మేనేజర్‌ పాండురంగారావు, మండల రె వెన్యూ అధికారులు మురళీకృష్ణ, శేఖర్‌, ఏపీఎం పుల్లయ్య, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:02 AM