Share News

Maoist Encounter: ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి

ABN , Publish Date - Sep 06 , 2025 | 05:09 AM

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్టు హతమయ్యారు.

Maoist Encounter: ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి

  • ఛత్తీస్‌గఢ్‌ అబూజ్‌మడ్‌ అడవుల్లో బలగాల కూంబింగ్‌

చర్ల, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్టు హతమయ్యారు. అబూజ్‌మడ్‌ అడవుల్ల్లో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌ బలగాలు కూబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌ జరుగుతుండగా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.


ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందిగా, మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక 303 రైఫిల్‌, 2 బీజీఎల్స్‌ లాంచర్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Updated Date - Sep 06 , 2025 | 05:09 AM