Share News

బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని.. రిటర్నింగ్‌ అధికారి వాహనాన్ని అడ్డుకున్న బాధితులు

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:54 PM

గత ఎంపీ ఎన్నికలకు సంబంధించిన వీడియో ఫోటో గ్రాఫర్స్‌, ఎలక్ర్టిసిటీ, టెంటు హౌజ్‌ బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని పేర్కొంటూ శనివారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చంద్రకళ వాహనాన్ని బాధితులు అడ్డుకున్నారు.

బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని..   రిటర్నింగ్‌ అధికారి వాహనాన్ని అడ్డుకున్న బాధితులు
ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వాహనాన్ని అడ్డుకుంటున్న బాధితులు

చెన్నూరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : గత ఎంపీ ఎన్నికలకు సంబంధించిన వీడియో ఫోటో గ్రాఫర్స్‌, ఎలక్ర్టిసిటీ, టెంటు హౌజ్‌ బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని పేర్కొంటూ శనివారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చంద్రకళ వాహనాన్ని బాధితులు అడ్డుకున్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నూరులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు రిటర్నింగ్‌ అధికారి చంద్రకళ చెన్నూరుకు వచ్చారు. ర్యాలీ అనంతరం తిరిగి ఆమె కారులో వెళ్తున్న క్రమంలో బాధితులు నిమ్మల బాపు, మిర్జామసూద్‌బేగ్‌లు కారును అడ్డుకుని నిరసన తెలిపారు. అధికారుల ఆదేశాల ప్రకారం ఎంపీ ఎన్నికల సమయంలో ఎలక్ర్టిసటీ, టెంటు హౌజ్‌, వీడియో, ఫొటో గ్రాఫర్లను ఏర్పాటు చేశారని, కానీ ఇప్పటివరకు అందుకు సంబంధించిన బిల్లులు చె ల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. అక్కడే ఉన్న తహసీల్దార్‌ మల్లికార్జున్‌ బాధితు లతో కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ఎన్నికల్లో వివిధ శాఖల్లో పనిచేసిన వారికి వచ్చిన బడ్జెట్‌ ప్రకారం డబ్బులు చెల్లించామని, మిగితా బడ్జెట్‌ రాగానే అందరి డబ్బులు చెల్లిస్తామని పేర్కొనడంతో వారు ఆందోళన విరమించారు.

Updated Date - Jan 25 , 2025 | 11:54 PM