రక్తనిధి భవన నిర్మాణంపై పట్టింపేది..?
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:50 PM
మంచిర్యాల రక్తనిధి కేంద్రానికి నూతన భవన నిర్మాణ హా మీ ఏళ్ల తరబడి నెరవేరకపోవడంతో తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులు నానా ఇబ్బందులు పడుతు న్నారు.

ఐదు జిల్లాల రోగులకు అందుబాటులో ఏకైక కేంద్రం
అమలుకు నోచుకోని ఐఆర్‌సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడి హామీ
పరికాలు ఉన్నా....సొంత భవనంలేక తప్పని ఇబ్బందులు
ఇరుకు గదుల్లో తలసేమియా వ్యాధిగ్రస్తుల అవస్థలు
దాతల సహకరిస్తేనే నూతన భవన నిర్మాణం..
మంచిర్యాల, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల రక్తనిధి కేంద్రానికి నూతన భవన నిర్మాణ హా మీ ఏళ్ల తరబడి నెరవేరకపోవడంతో తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులు నానా ఇబ్బందులు పడుతు న్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుప త్రిలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రంలో సిబ్బంది పరంగా కొరత లేనప్పటికీ సౌకర్యాల లేమితో సికిల్ సెల్, తలసేమియా రోగులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. 2008లో తొలిసారిగా మంచిర్యాలకు రక్త నిధి కేంద్రం మంజూరు కాగా కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబా ద్, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెం దిన రోగులు దానిపై ఆధారపడి చికిత్స పొందుతు న్నారు. రోగుల సంఖ్యకు సరిపడా సౌకర్యాలు లేక పో వడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నా యి. మంచిర్యాల రక్తనిధి కేంద్రంలో సుమారు 900 మంది సికిల్‌సెల్, తలసేమియా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ సెలైన్ వాష్‌డ్ ఆర్బీసీ మెషీ న్లు 2, లామినర్ ఎయిర్ ఫ్లో మిషన్ 1, హెచ్‌బీఏ 2 టెస్టింగ్ మెషిన్ 1, సీరం ఫెరిటిన్ టెస్టింగ్ మెషిన్ 1, సింగిల్ ప్లేట్‌లెట్ డోనర్ మిషన్ 1, రూ. 28 లక్షల వి లువగల ఆటో సెంట్రి ప్యూజ్ పరికరం అందుబాటు లో ఉన్నాయి. ఆధునిక యంత్రాలకు అనుగుణంగా 20 మందికిపైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక పరికరాలు సిబ్బంది అందుబాటులో ఉం డటంతో ఇక్కడ చికిత్స పొందుతున్న వారి సంఖ్య క్ర మేపీ పెరుగుతుండగా సౌకర్యాల లేమితో వారంతా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
అమలుకాని ఐఆర్‌సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడి హామీ...
మంచిర్యాల రక్తనిధి కేంద్రం నూతన భవనానికి స్థలం కేటాయిస్తే నిధులు మంజూరు చేయిస్తాన్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడి హామీ అమలు కాకపోవడం వ్యాధిగ్రస్తులకు శాపంగా మా రింది. ఐఆర్‌సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అప్పటి ప్రభుత్వ సలహాదారు బి పాపారావు 2018 ఏప్రిల్ 2న మంచిర్యాల బ్లడ్ బ్యాంకును సందర్శించారు. ఆ యన వెంట అప్పటి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, అప్పటి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కూడా రక్తనిధిని సంద ర్శించారు. ఈ సందర్భంగా మంచిర్యాల రక్తనిధి కేం ధ్రానికి అత్యవసరంగా నూతన భవనం ఏర్పాటు చే యాల్సి ఉందని పాపారావు అభిప్రాయపడ్డారు. బ్లడ్‌బ్యాంకు సరియైున స్థలం లేక ఇరుకు గదుల్లో కొనసాగుతున్నా నిర్వహణ చాలా బాగుందని సంతృప్తి వ్య క్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్, వరం గల్‌లోని బ్లడ్ బ్యాంకుల కన్నా మంచిర్యాల మొదటి స్థానంలో ఉందని కితాబిచ్చారు. బ్లడ్ బ్యాంకు నిర్వహణకు అన్ని వసతులున్నా మరో భవనం కేటాయించాలని కలెక్టర్‌కు సూచించారు. ప్రభుత్వ యంత్రాం గం తరుపున భూమి కేటాయిస్తే తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులకు త్వరలోనే నూతన భవనం ఏ ర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్టీపీసీ, సింగరేణితోపాటు ఇక్కడి ఎమ్మెల్యే సహకారంతో మరుసటి సంవత్సరానికి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చా రు. దాదాపు ఏడున్నరేళ్లు గడిచినా హామీ అమలు కా కపోగా కనీసం స్థలం కేటాయింపులు కూడా జరగలేదు.
స్థలం కేటాయింపులో నిర్లక్ష్యం....
రక్తనిధి కేంద్రానికి నూతన భవన నిర్మాణం చేప ట్టేందుకు స్థలం కేటాయింపులో నిర్లక్ష్యం కారణంగా ఇంతకాలం అది కార్యరూపం దాల్చలేదు. దీంతో పా త భవనంలో ఇరుకు గదుల్లో చికిత్స అందించాల్సి వ స్తోంది. ఇదిలా ఉండగా జిల్లా వైద్య కళాశాలకు అను బంధంగా మంజూరైన 350 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం చివరి దశకు చేరుకుంది. నిర్మాణం పూర్తికా గానే ఐదారు నెలల్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)ని అక్కడికి తరలిస్తారు. ప్ర స్తుతం బ్లడ్ బ్యాంక్ కొనసాగుతున్న జీజీహెచ్ భవనాన్ని తొలగించి, ఆ స్థానంలో ట్రామా సెంటర్ నిర్మాణం చేప ట్టేందుకు సన్నాహాలు చేస్తు న్నారు. భవనాన్ని తొలగించనున్నందున బ్లడ్‌బ్యాంక్ ఉన్న పలంగా అ క్కడి నుంచి మార్చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కాలేజ్ రో డ్డులోని వయోవృద్ధుల డే కేర్ సెంటర్ పక్కన గల స్థలాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు ఎంపిక చేశారు. అక్కడ రూ. కోటి అంచనా వ్యయం తో భవన నిర్మాణం చేపట్టనుండగా, ఆర్థిక సహాయం కోసం దాతలపై ఆధారపడక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వపరంగా స్థలం మంజూరు చేయకపోగా, భవన నిర్మాణం కూడా చేపట్టకపో వడంతో దాతలపైనే ఆశలు పెట్టుకున్నారు. పైగా భవన నిర్మాణానికి ఎంపిక చే సిన స్థలం కూడా బ్లడ్‌బ్యాంక్‌కు అనువైనది కాదనే అభిప్రాయాలు వ్య క్తమవుతున్నాయి. చికిత్స కోసం వచ్చే రోగులు అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడక తప్పని పరిస్థితులు ఉంటాయనే భావన సభ్యుల్లో నెలకొంది.
దాతలు సహకరించాలి...
రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్‌రెడ్డి
త్వరలో బ్లడ్‌బ్యాంక్‌ను తరలించాల్సి రావడంతో నూ తన భవన నిర్మాణం కోసం అనువైనది కాకపోయినా కాలేజ్ రోడ్డులో స్థలం ఎంపిక చేయాల్సి వచ్చింది. అం దులో నూతన భవనం నిర్మించడానికి సుమా రు కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ నిధుల కోసం దాతలపై ఆధారప డక తప్పని పరిస్థితులు ఉన్నాయి. నూతన భవన నిర్మాణానికి ఫిబ్రవ రి 3న భూమిపూజకు ఏర్పాట్లు చేస్తున్నాం. భవన నిర్మాణానికి ఆయ్యే ఖర్చులకు దాతలు సహకరించాలి.