Minister Adluri Laxman: వికలాంగుల సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:56 AM
వికలాంగుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం అని, వారి కుటుంబాలలో ఆనందం చూడటమే తమ
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వికలాంగుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం అని, వారి కుటుంబాలలో ఆనందం చూడటమే తమ ఆశయం అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. వికలాంగుల ఉద్యోగుల బదిలీల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 34 పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వికలాంగుల ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం మంత్రి అడ్లూరితో పాటు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యను కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ‘డిఫరెంట్లీ ఏబుల్డ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ’ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వికలాంగుల స్వయం సమృద్ధి కోసం ప్రభుత్వం వేల సంఖ్యలో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.