Traffic Awareness: ఇంద కట్టుకో.. హెల్మెట్టు పెట్టుకో
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:21 AM
హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ తోలొద్దు సోదరా.. అంటూ వాహనదారులకు సందేశాన్నిచారు ఆ
కొత్తపేట (ఆంధ్రజ్యోతి): హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ తోలొద్దు సోదరా.. అంటూ వాహనదారులకు సందేశాన్నిచారు ఆ ట్రాఫిక్ మహిళా కానిస్టేబుళ్లు! హెల్మెట్లు లేని బైకర్లను గుర్తించి.. ఆపి వారి చేతికి రాఖీ కట్టారు. హెల్మెట్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కొన్నిసార్లు అది కుటుంబసభ్యులకు శరాఘాతం అవుతుందని.. తప్పకుండా శిరస్త్రాణం ధరించాలంటూ రాఖీ కడుతూ చెప్పారు. ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో అల్కాపురి చౌరస్తాలో ఈ వినూత్న అవగాహన కార్యక్రమం స్థానికులను ఆకట్టుకుంది.