Share News

షుగర్‌ ఫ్యాక్టరీ పునఃప్రారంభిస్తాం

ABN , Publish Date - Jan 20 , 2025 | 01:16 AM

ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రా రంభానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరాభవన్‌లో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన కోటి యాభై లక్షల విలువల గల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన అనంతరం విలేఖరుల సమావేశం నిర్వహించారు.

షుగర్‌ ఫ్యాక్టరీ పునఃప్రారంభిస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

26 నుంచి రేషన్‌ కార్డుల జారీ

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల అగ్రికల్చర్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రా రంభానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరాభవన్‌లో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన కోటి యాభై లక్షల విలువల గల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన అనంతరం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద లబ్దిదారులకు ఆసుపత్రిల్లో అయిన ఖర్చులో 25-30శాతం అందిస్తుందన్నారు. ప్రజలు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లో వైద్యసేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల వరకు వైద్య ఖర్చులు అందజేస్తుందన్నారు. గత ప్రభుత్వం కన్నా మిన్నగా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రుణమాఫీ అంశాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ గత ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టలేదని, బీజేపీకి రుణమాఫీపై సోయిలేదన్నారు. దేశంలో రైతుల కు రుణమాఫీ చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని, యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మే అన్ని రాష్ట్రాల రైతులకు ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని, గత ప్రస్తుత ప్రభుత్వాలు ఆ విధానాన్ని కొనసా గింపు చేస్తున్నాయన్నారు. జనవరి 26 నుంచి రేషన్‌కార్డుల జారీ, రైతుభరోసా, వ్యవసాయ కూ లీలకు రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు కట్టిం చే లా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, అ నర్హులకు ఒత్తిళ్లకు తలొగ్గి ఇళ్ల మంజూరుకు అవకాశం ఇస్తే చట్టప్రకారం చర్యలుంటాయ న్నారు. పసుపు బోర్డు ప్రకటన శుభపరిణామమని, పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందిస్తున్న ఘనత కాం గ్రెస్‌ పార్టీదేనని ఇచ్చిన హామీలను అమలు చేస్తు ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు బండ శంకర్‌, తాటిపర్తి విజయలక్ష్మీదేవేంధర్‌రెడ్డి, పిప్పిరి అనిత, జున్ను రాజేంధర్‌, రాధాకిషన్‌రావు, దుర్గయ్య, బారి, కమాల్‌, రమేష్‌ తదితరులున్నారు.

Updated Date - Jan 20 , 2025 | 01:16 AM