Share News

పాఠశాల మైదానంలో వసతులు కల్పిస్తాం

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:41 PM

మండల పరిధిలోని కొండూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో వసతుల కల్పనకు కృషి చేస్తామని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సోలపోగుల స్వాములు అన్నారు.

పాఠశాల మైదానంలో వసతులు కల్పిస్తాం
క్రీడా మైదానం నమూనాను వివరిస్తున్న అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సా్వాములు

- అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సోలపోగుల స్వాములు

పెంట్లవెల్లి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని కొండూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో వసతుల కల్పనకు కృషి చేస్తామని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సోలపోగుల స్వాములు అన్నారు. బుధ వారం ఆయన మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిష త్‌ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు, సదు పాయాల గురించి పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చామని తెలిపారు. వివిధ అంశాలపై స్థానిక నాయకులు, గ్రామ యువకులను అడిగి తెలు సుకున్నారు. భవిష్యత్తులో జరగబోయే రాష్ట్ర స్థా యి అథ్లెటిక్స్‌ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 2000 మందికి పైగా అథ్లెట్స్‌ హాజరవుతారని ఆయన అన్నారు. పోటీలకు తమ వంతుగా పూర్తి సహకరిస్తామని మాజీ సర్పంచు నల్లపోతుల గోపాల్‌ పేర్కొన్నారు. కా ర్యక్రమంలో పీడీలు కుమారస్వామి, సురేష్‌, మోహన్‌కుమార్‌, యువకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 11:41 PM