అందరి సహకారంతో ఆలయం నిర్మిస్తాం
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:32 PM
మండల కేంద్రమైన అమ్రాబాద్‌లో పోచమ్మ దేవత నూతన ఆలయ నిర్మాణానికి స్థానిక ఎ మ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం భూమి పూ జ నిర్వహించారు.

- అమ్రాబాద్‌లో పోచమ్మ ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
అమ్రాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రమైన అమ్రాబాద్‌లో పోచమ్మ దేవత నూతన ఆలయ నిర్మాణానికి స్థానిక ఎ మ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం భూమి పూ జ నిర్వహించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ గ్రామ స్థుల సహకారంతో పో చమ్మ ఆలయాన్ని నిర్మించుకోవడం సంతోష దాయకమని అన్నారు. ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పోచమ్మ ఆలయ నిర్మా ణ కమిటీ అధ్యక్షుడు రాములు గౌడ్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరి నారాయణగౌడ్ ఆల య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మద్దిమడుగు పుణ్యక్షేత్రంలో ఎమ్మెల్యే బస
పదర : నల్లమలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన తెలంగాణకు తలమాణికంగా తీర్చిదిద్దు తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నా రు. ఆయన బుధవారం రాత్రి మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో బస చేసి గురువారం ఉదయం ప్రత్యేక పూజల్లో పా ల్గొన్నారు. మద్దిమడుగు ఆలయంలో స్టేజీ నిర్మాణ పనులకు, మారడుగు, గానుగపెంట తదితర గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాల కు భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వంకేశ్వరం గ్రామంలో మడేలయ్యా ఆలయానికి మట్టి రోడ్డును మంజూరు చేశారు. మండల కేం ద్రంలో రూ.40లక్షల అభివృద్ధి పనులు చేపట్టా రు. కొన్ని ఆలయాలకు ప్రొసీడింగ్స్ అందజేశా రు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏఆర్.యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి ఎడ్ల ఆనంద్, యూత్ కాంగ్రెస్ అధ్య క్షుడు వడ్నాల హరికృష్ణ, మాజీ సర్పంచ్ ప్రేమ్, నాయకులు సత్యనారాయణ, వెంకటయ్య, సైజాదీ, హలరాజు పాల్గొన్నారు.
పల్లెల ప్రగతితోనే రాష్ట్రం అభివృద్ధి
లింగాల : పల్లెల ప్రగతితోనే రాష్ట్రం పురోభి వృద్ధి చెందుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. అవుసలికుంట గ్రామంలో రైతులకు స్ర్పింక్లర్లు పంపిణీ చేశారు. అంబటిపల్లి, ధారా రం, కేసీతండా, జిలుగుపల్లి తదితర గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. రూ.58కో ట్లతో మారుమూల గ్రామాలు, తండాల్లో సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు కొత్త నాగేశ్వర్‌రావు, శ్రీనివాస్ రాథోడ్ ఉన్నారు.