Share News

స్థోమత లేని ఖైదీలకు న్యాయవాదిని నియమిస్తాం

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:42 PM

స్థోమత లేని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున ప్రభుత్వ న్యాయవాదిని ని యమిస్తామని జిల్లా ప్రధాన న్యాయాధికారి డి.రాజేష్‌బాబు అన్నారు.

స్థోమత లేని  ఖైదీలకు న్యాయవాదిని నియమిస్తాం
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి డి.రాజేష్‌బాబు

- జిల్లా ప్రధాన న్యాయాధికారి రాజేష్‌ బాబు

కందనూలు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : స్థోమత లేని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున ప్రభుత్వ న్యాయవాదిని ని యమిస్తామని జిల్లా ప్రధాన న్యాయాధికారి డి.రాజేష్‌బాబు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖైదీల హక్కుల గురించి జిల్లా కేంద్రంలోని సబ్‌ జైలు లో నిర్వహించిన సమావేశానికి ప్రధాన న్యా యాధికారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఖైదీలకు కల్పిస్తున్న మౌలిక వసతులను వివ రించారు. ఆర్థిక స్థోమత లేని ఖైదీలు డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీని సంప్రదిస్తే ప్రభుత్వ న్యాయవాదిని నియమి స్తామన్నారు. ఖైదీలకు వారానికోసారి వైద్య పరీ క్షలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ బి.శ్రీనివాసు లు, ఎం.మధుసూదన్‌రావు, ఏసీపీ శ్రీరామ్‌ ఆర్య, పవన శేషసాయి, జైల్‌ సూపరింటెండెంట్‌ బి.నాగరాజు, జైలు సిబ్బంది, న్యాయశాఖ ఉద్యో గులు ఎం.కేశవరెడ్డి, ఎం.బాలరాజు, ఎం.రాజు, వంశీ, నాగరాజు, స్వప్న పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:42 PM