గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలి
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:05 AM
మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో మాధవరెడ్డి అన్నారు.

గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలి
ఎంపీడీవో మాధవరెడ్డి
గట్టుప్పల్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో మాధవరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులు సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ వేసవి కాలంలో నిరంతరం తాగునీటి సరఫ రా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఇంటి పన్నులు 100 శాతం వసూలు చేయాలని, నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నీటి ఎద్దడి నివారణకు భాగస్వాములు కావాలి
మర్రిగూడ: నీటిఎద్దడి నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నీ టిని వృథా చేయకుండా వాడుకోవాలని ఎంపీడీవో మున్నయ్య అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీలో ముత్యాలమ్మ దేవాలయం వద్ద కాలనీవాసులకు నీటి నిర్వహణపై అవగాహన నిర్వహించారు. వేసవి కాలం ప్రారంభమైందున నీటిపై ప్రభావం పడనుందని, ప్రజలు గమనించి నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. అవసరాలకు మాత్రమే వాడుకొని నీటి ఎద్దడిని నివారించాలన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నీటి ఎద్దడి నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 18 గ్రామపంచాయతీల పరిధిలోని 24 ఆవాస గ్రా మాల్లో 13,146 గృహాలను సందర్శించినట్లు ఆయన తెలిపారు. మంచినీటిని వృథా చేయవద్దని మిషన భగరీథ ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో నేటితో ముగిసిందన్నారు. మర్రిగూడ కార్యదర్శి యూసుఫ్, లక్ష్మి, రాజేష్, నజీరా తదితరులు ఉన్నారు.