Share News

ఏళ్లుగా ఉంటున్నాం..ఇప్పుడేం సర్వే

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:28 PM

ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని తాతలు, తండ్రుల కాలం నుంచి తాము ఇక్కడ జీవిస్తున్నాం.. తమ ఇండ్ల అడుగు భూమిని ముత్యంరావు వారసుడిగా చెప్పుకునే ఆనం ద్‌కృష్ణ మోస పూరిత పట్టాలు చేసుకున్నాడు.

ఏళ్లుగా ఉంటున్నాం..ఇప్పుడేం సర్వే
ఇందారంలో సర్వేయర్‌కు వినతి పత్రం ఇస్తున్న గ్రామస్థులు

రెవెన్యూ అధికారులను అడ్డుకున్న స్థానికులు

జైపూర్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని తాతలు, తండ్రుల కాలం నుంచి తాము ఇక్కడ జీవిస్తున్నాం.. తమ ఇండ్ల అడుగు భూమిని ముత్యంరావు వారసుడిగా చెప్పుకునే ఆనం ద్‌కృష్ణ మోస పూరిత పట్టాలు చేసుకున్నాడు. ఇందులో హద్దులు గు ర్తించేందుకు ఇప్పుడు సర్వే ఏందీ అంటూ ఇందారం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇందారం గ్రామంలో 1113 సర్వే నెంబరులో హద్దులను గుర్తించేందుకు సోమవారం సర్వే యర్‌ రామస్వామి సర్వే నిర్వహిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. వందల ఏళ్లుగా ఇండ్లు నిర్మించుకుని తాము ఇక్కడ జీవిస్తున్నామని, ఆనంద్‌కృష్ణ అనే వ్యక్తి మోస పూరిత పట్టాలు చేసుకున్నాడని పేర్కొ న్నారు. మిగులు భూములను గ్రామంలో పట్టాలు లేకుండా ఉన్న భూములను రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టాలు చేసుకుని సర్వే పేరుతో స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వారు పే ర్కొన్నారు. వందల ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న భూ ములకు పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవా లని డిమాండ్‌ చేశారు. ఇంటి అడుగు స్థలాలను పట్టాలు చేసుకుని గుంటకు డబ్బులు కావాలని డిమాండ్‌ చేసి పట్టా చేస్తానని చూస్తు న్నారన్నారు. కలెక్టర్‌ స్పందించి ఇందారం భూ మివ్యవహరంపై విచా రణ జరిపి అక్రమంగా పట్టా చేసుకున్న వారిని, వారికి సహకరించి పట్టాలుచేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అ నంతరం సర్వేయర్‌కు వినతి పత్రం అందించారు. సర్వేయర్‌ను, రెవె న్యూ సిబ్బంది గ్రామస్థులు అడ్డు కోవడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు.

Updated Date - Feb 24 , 2025 | 11:28 PM