Share News

చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలి

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:03 AM

రాష్ట్రంలో యా సంగి పంట సాగుకు నీటిని చివరి ఆయకట్టు వరకు అందించాలని రా ష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు.

 చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో యా సంగి పంట సాగుకు నీటిని చివరి ఆయకట్టు వరకు అందించాలని రా ష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, వ్యవ సాయ బోరుబావుల కింద సాగయ్యే సాయంగి పంటలకు సాగునీటిని చివరి ఆయకట్టు వరకు అందించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సీజన్‌లో ఒక ఎకరం కూడా ఎండి పో కూడదని, వచ్చే 10 రోజులు చాలా కీలకమైన సమయమని తెలి పారు. తాగునీరు, సాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడా లన్నారు. అలాగే ప్రతి గురుకు లాన్ని సందర్శించి విద్యార్థులకు నూత న మెను అమలు పై తనిఖీలు చేయాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలో సాగయ్యే యాసంగి పంటల కోసం ఎత్తిపోతల పథకం, ప్రాజెక్టులు, చెరువులు, బోరుబావుల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేందుకు అధికారులు సమన్వయంతో చర్య లు తీసుకుంటామని తెలిపారు.

సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలను సందర్శించి భోజ నం పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 12:03 AM