‘ఢీ’సీసీ..!
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:17 AM
కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ నెలకొంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్ పెట్టిన కొత్త నిబంధనలు పాత కాపులకు షాక్ ఇచ్చింది. మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న నేతలకు అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. ఐదేళ్ల పార్టీ సభ్యత్వం కూడా మరికొందరికి నిరాశ పరిచింది...
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు పోటాపోటీ
రెండు సార్లు అధ్యక్ష పదవిలో ఉన్నవారికి నో చాన్స్
ఐదేళ్లు పార్టీ సభ్యత్వం ఉండాలనే నిబంధనతో మరికొందరికి నిరాశ
నాయిని తప్పుకోవడంతో హనుమకొండ అధ్యక్ష పీఠంపై ఉత్కంఠ
ఇనుగాల, మార్క, పింగిళి, దొమ్మాటితో పాటు పలువురి పేర్లు
వరంగల్ జిల్లా అధ్యక్ష పదవిపై పలువురు నేతల కన్ను
ములుగులో తెరపైకి గొల్లపల్లి.. తనకే కావాలంటున్న రాంరెడ్డి
జనగామలో కొమ్మూరికి చాన్స్ లేకుంటే రేసులో ఝాన్సీరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి
భూపాలపల్లి, మహబూబాబాద్‌లోనూ డీసీసీ కుర్చీపై పలువురి నజర్
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్ : కాంగ్రె్‌సలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ నెలకొంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్ పెట్టిన కొత్త నిబంధనలు పాత కాపులకు షాక్ ఇచ్చింది. మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న నేతలకు అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. ఐదేళ్ల పార్టీ సభ్యత్వం కూడా మరికొందరికి నిరాశ పరిచింది. దీంతో పార్టీలో సీనియర్‌లు, యువ నేతలు డీసీసీ రేసులోకి వస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లో ఏఐసీసీ పరిశీలకుడు డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే హనుమకొండలో డీసీసీ ప్రెసిడెంట్ పదవికి గట్టి పోటీ ఉండగా, మిగతా జిల్లాల్లోనూ ఇదే తీరు కనిపిస్తోంది. కులాల సమీకరణలో డీసీసీ పగ్గాలు ఎవరికి దక్కుతాయో అనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.
పాత వారికి నో చాన్స్
రెండు పర్యాయాలు డీసీసీ అధ్యక్షులుగా పని చేస్తున్నవారు.. మూడోసారి అధ్యక్ష పదవికి అవకాశం లేదని మీనాక్షినటరాజన్ తేల్చి చెప్పడంతో హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మరోసారి ఎ మ్మె ల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కొనసాగుతారనే చర్చకు బ్రేక్ పడింది. హనుమకొండ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకా్‌షరెడ్డి, కేఆర్.నాగరాజు తదితరులు నాయిని మ రోసారి కొనసాగించాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చే శారు. సీఎం వరంగల్ పర్యటనలో ఇదే అంశాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించగా, పార్టీ నిబంధనలు మా ర్చటం కుదరదని కుండబద్దలు కొట్టినట్లుగా స మాచారం. అయితే మరోసారి జిల్లా అధ్యక్ష పద వి తనకు ఆసక్తి లేదని నాయిని రాజేందర్‌రెడ్డి అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. అయితే రాజకీయ సమీకరణలో నేపథ్యంలో నాయినినే కొనసాగించాలని ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు ఫ లించే పరిస్థితి కనిపించటం లేదు. అలాగే వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ములు గు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఐతే ప్రకా్‌షరెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్‌చంద్రారెడ్డి తదితరులకు కూడా మరోసారి చాన్స్ దక్కే అవకాశాలు లేకుండాపోయాయి. వీరిలో దాదాపు అందరూ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినవారే. భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవి కోసం గాజర్ల అశోక్, అప్పం కిషన్‌తో పాటు 36మందికి పైగా పోటీ పడ్డారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 90శాతం మంది ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో పాటు ఎన్నికల ముందే కాంగ్రె్‌సలో చేరినవారే. దీంతో వీరు పోటీకి అనర్హులు కావటం కాంగ్రె్‌సలో చర్చనీయాంశంగా మారింది.
హనుమకొండలో ఢీ అంటే ఢీ
ఉమ్మడి వరంగల్‌కు కేంద్రంగా ఉన్న హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటాపోటీ నెలకొంది. డీసీసీ ప్రెసిడెంట్ పదవి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి ఇవ్వకుంటే తనకే ఇవ్వాలని అధిష్ఠానంపై కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాలను పోటీ నుంచి తప్పుకున్నానని, 15ఏళ్లకు పైగా స్థానికంగా ఉంటూ పార్టీ శ్రేణులతో కలిసిపోతున్న తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఇనుగాల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే దొమ్మాటి సాంబయ్య, జంగా రాఘవరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, మార్క విజయ్‌కుమార్‌తో పాటు పింగిళి వెంకటరాంనర్సింహరెడ్డి, తోట వెంకన్న, రవీందర్‌యాదవ్, బంక సరళ తదితరుల పేర్లు తెర పైకి వస్తున్నాయి. అయితే హనుమకొండ జిల్లాలో ఎమ్మెల్యేలు ఓసీ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉండటంతో పాటు జడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వుడు అయింది. అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత దక్కలేదు. దీంతో డీసీసీ అధ్యక్ష్య పదవైనా బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ నేత మార్క విజయ్‌కుమార్ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. 30ఏళ్లుగా రెడ్డి సామాజికవర్గం చేతిలోనే అధ్యక్ష పదవి ఉందనే వాదనను వినిపిస్తున్నారు. దీంతో సామాజిక సమీకరణలో హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో అనే చర్చ జరుగుతోంది.
నేతల నజర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో జిల్లా అధ్యక్ష పదవికి డిమాండ్ పెరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో డీసీసీ అధ్యక్షులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో డీసీసీ పీఠంపై పలువురు కీలక నేతలు కన్నేశారనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా వరగంల్ జల్లా అధ్యక్ష పదవి కోసం కీలక నేతలు తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు మరోసారి అవకాశం రాకుంటే ఆమె భర్త వరద రాజేశ్వర్‌రావును పోటీలో దిగుతారనే ప్రచారం ఉంది. మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తన అనుచరులకు డీసీసీ పదవి ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కార్పొరేటర్ పోశాల పద్మ, మీసాల ప్రకాష్, గోపాల నవీన్‌రాజుతో పాటు మరో నలుగురైదుగురు నేతలు బరిలో దిగుతున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి తన అనుచరులతో కూడా దరఖాస్తు చేయించారు. మొత్తంగా వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది.
జనగామ జిల్లా అధ్యక్ష పదవిపై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి నజర్ వేశారు. మొదటి నుంచి జడ్పీ చైర్మన్, లేదంటే డీసీసీ అధ్యక్ష పదవి కావాలనే ఆలోచనతో ఝాన్సీరెడ్డి ఉన్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ను సైతం ఝాన్సీరెడ్డి కలిసినట్లుగా ప్రచారం ఉంది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు కొమ్మూరి ప్రతా్‌పరెడ్డికి మరోసారి అవకాశం రాకుంటే కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉందనే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇప్పటికే ప్రశాంత్‌రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఏఐసీసీ పరిశీలకుడికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరే కాకుండా మరో నలుగురైదుగురు డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.
ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్‌నే మరోసారి కొనసాగించాలని మంత్రి సీతక్క భావించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే మూడోసారి నో చాన్స్ అనే నిబంధన తెరపైకి రావటంతో ఎవరికి డీసీసీ పదవి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఆరుగురు డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోగా, మాజీ మార్కెట్ చైర్మన్ గొల్లపల్లి రాజేందర్ పేరు తెరపైకి వస్తోంది. పార్టీలో సీనియర్ నేత కావటంతో మంత్రి గొల్లపల్లి వైపే మొగ్గు చూపిస్తోందని తెలుస్తోంది. అయితే ఏటూరునాగారం మాజీ సర్పంచ్ వెంకన్న కూడా బరిలో ఉండటంతో పాటు మల్లారెడ్డి కూడా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేయటంతో ములుగు డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది.
భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవికి గాజర్ల అశోక్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఏఐసీసీ పరిశీలకుడికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే పార్టీలో ఐదేళ్ల నిబంధన తెరపైకి రావటంతో అశోక్ ఆశలపై నీళ్లు చల్లాయనే చర్చ నెలకొంది. అశోక్‌తో పాటు అప్పం కిషన్ కూడా డీసీసీ ప్రెసిడెంట్ పదవిపై కన్నేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భూఫాలపల్లి జిల్లా అధ్యక్ష పదవికి భారీగా దరఖాస్తులు రాగా, ఐదేళ్ల పార్టీ సభ్యత్వం నిబంధనతో 90శాతం దరఖాస్తులు కొట్టుడుపోయినట్టేననే చర్చ నెలకొంది. చల్లూరు మధుతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు డీసీసీ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి కూడా పోటాపోటీ నెలకొంది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు భరత్‌చంద్రారెడ్డికి మరోసారి అవకాశం లేకుంటే వెన్నం శ్రీకాంత్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే బీసీ నేత అంజయ్యతో పాటు పలువురు సీనియర్ నేతలు డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.