Share News

Vivek Venkataswamy: ఏ శాఖ అప్పగించినా ఓకే

ABN , Publish Date - Jun 10 , 2025 | 07:12 AM

మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ముఖ్యమంత్రి చేతిలో ఉంటుందని నూతన మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. అయితే తనకు ఏ శాఖ అప్పగించినా ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా పనిచేస్తానన్నారు.

Vivek Venkataswamy: ఏ శాఖ అప్పగించినా ఓకే

  • ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తా: వివేక్‌

న్యూఢిల్లీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ముఖ్యమంత్రి చేతిలో ఉంటుందని నూతన మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. అయితే తనకు ఏ శాఖ అప్పగించినా ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా పనిచేస్తానన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను వారి నివాసాల్లో కలిశారు. అనంతరం వివేక్‌ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయం చేయాలన్న రాహుల్‌ గాంధీ ఆలోచన పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఓసీ, ఇతర సామాజిక వర్గాల్లోని ఆశావహులకు ఖాళీగా ఉన్న మరో మూడు మంత్రి పదవుల్లో అవకాశం కల్పించనున్నట్లు ఖర్గే చెప్పారన్నారు. తెలంగాణలో కాంగ్రె్‌సను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఖర్గే, వేణుగోపాల్‌ అభిప్రాయపడ్డారని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తమ ఫలితాల కోసం కృషి చేయాల్సిందిగా సూచించారని తెలిపారు.

Updated Date - Jun 10 , 2025 | 07:14 AM