వైభవంగా కొనసాగుతున్న విశ్వశాంతి మహాయాగం
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:26 PM
నస్పూర్ పట్టణంలో నిర్వహిస్తున్న విశ్వశాంతి మహా యాగ మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది.

తరలివస్తున్న భక్తజనం..ప్రత్యేక పూజలు
నస్పూర్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : నస్పూర్ పట్టణంలో నిర్వహిస్తున్న విశ్వశాంతి మహా యాగ మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం గోపూ జ, తులసీ పూజ, శ్రీ రుద్ర సహిత మృత్యుంజయ హోమాలు, రుద్రాభిషేకం, కుంకుమార్చన, విష్ణు సహస్ర నామ, లలిత సహస్ర నామ, సౌందర్య లహరి పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ, భజన, సహస్ర జ్యోతిర్లింగార్చన, రుద్రక్రమార్చనలు జరిగాయి. పూజల అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు గోదావరి ఖని, పెద్దపల్లి ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి హోమంలో పాల్గొంటున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శనం చేసుకుని వెళుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లను చేశామని పెర్కొన్నారు. మహాయాగం సందర్బంగా విద్యుత్ కాంతు లతో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్ర పటాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. యాగ శాలల ప్రాం గణంలో విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన వివిధ దేవుళ్ల చిత్రాలను ఆకట్టుకుంటున్నాయి.