వేంకటేశ్వరస్వామి కల్యాణం.. కమనీయం
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:23 PM
కల్వకుర్తి పట్టణంలోని శ్రీలక్ష్మీ పద్మావతి వేంక టేశ్వరస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మో త్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నా యి.

-హాజరైన ఎమ్మెల్యే నారాయణరెడ్డి
కల్వకుర్తి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి పట్టణంలోని శ్రీలక్ష్మీ పద్మావతి వేంక టేశ్వరస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మో త్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నా యి. సోమవారం ఉదయం 5గంటల నుండే సుప్రభాత సేవ, పూజా కార్యక్రమాలు ప్రారంభ మయ్యాయి. రాత్రి వేంకటేశ్వ రస్వామి కల్యాణో త్సవం కమనీయంగా జరిగింది. వేద పండితు ల మంత్రోచ్ఛరణాల మధ్య కనుల పండువగా జరిగింది. ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారిలు హాజరై పూజలు నిర్వహించారు. స్వామి వారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు నిర్వాహకులు విశాల వసతులు కల్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్, మాజీ ముని సిపల్ చైర్మన్లు రాచోటి శ్రీశైలం, ఆలయ కమిటీ చైర్మన్ కల్వ మనోహర్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.