Share News

Uttam Kumar Reddy: బీఆర్‌ఎస్‌ వల్లే గోదావరి బేసిన్‌లో ఇబ్బందులు

ABN , Publish Date - Mar 06 , 2025 | 06:20 AM

165 టీఎంసీల నీటి లభ్యత అదనంగా తెలంగాణలో ఉండేదని గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ పూర్తి చేస్తే కాంగ్రె్‌సకు మంచి పేరు వస్తుందన్న ఆక్రోశంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టారని ఆక్షేపించారు.

Uttam Kumar Reddy: బీఆర్‌ఎస్‌ వల్లే గోదావరి బేసిన్‌లో ఇబ్బందులు

కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయాన్ని సవరిస్తున్నాం

హరీశ్‌రావు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు: ఉత్తమ్‌

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి బేసిన్‌లో నీటి ఎద్దడికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలే కారణమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉంటే... 165 టీఎంసీల నీటి లభ్యత అదనంగా తెలంగాణలో ఉండేదని గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ పూర్తి చేస్తే కాంగ్రె్‌సకు మంచి పేరు వస్తుందన్న ఆక్రోశంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టారని ఆక్షేపించారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియాతో చిట్‌చాట్‌గా ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కృష్ణా జలాల కేటాయింపులు ఉండగా... 2015 జూన్‌లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఒప్పందం చేసుకున్నది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని మండిపడ్డారు. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయాన్ని సవరించడానికి ఇప్పుడు తాము కృషి చేస్తున్నామన్నారు.నీటిపారుదల రంగంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన హరీశ్‌రావు.. ఇప్పుడు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆక్షేపించారు.

Updated Date - Mar 06 , 2025 | 06:20 AM