Share News

అందని ఆధార్‌ సేవలు

ABN , Publish Date - Mar 06 , 2025 | 11:55 PM

నార్కట్‌పల్లి మం డల కేంద్రంలోని ఆధార్‌ నమోదు కేంద్రాలు పది రోజులుగా మూత పడ్డాయి. ఆధార్‌ సేవల కొనసాగింపులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల కారణంగా నిర్వాహకులు కేంద్రాలను మూసివేసినట్లు తెలుస్తుంది.

 అందని ఆధార్‌ సేవలు

అందని ఆధార్‌ సేవలు

ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు

సాంకేతిక సమస్యగా పేర్కొంటున్న ఏజెన్సీలు

నార్కట్‌పల్లి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): నార్కట్‌పల్లి మం డల కేంద్రంలోని ఆధార్‌ నమోదు కేంద్రాలు పది రోజులుగా మూత పడ్డాయి. ఆధార్‌ సేవల కొనసాగింపులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల కారణంగా నిర్వాహకులు కేంద్రాలను మూసివేసినట్లు తెలుస్తుంది. ఫలితంగా ఆధార్‌ సేవ ల కోసం వినియోగదారులు పక్క మండలమైన చిట్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నార్కట్‌పల్లి మండల కేంద్రం లో ప్రస్తుతం రెండు ఆధార్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఒకటి రెవెన్యూ కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తుండగా మ రొకటి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచ కార్యాలయంలో (ధర్డ్‌ పార్టీగా) నిర్వహిస్తున్నారు. ఈ ఆఽధార్‌ కేంద్రాల్లో కొత్త ఆ ధార్‌ కార్డుల నమోదు, ఇప్పటికే ఉన్న ఆధార్‌ కార్డుల్లో దొ ర్లిన తప్పుల సవరణ వంటి సేవలు అం దిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతీ పని ఆధార్‌ తో ముడిపడి ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ రెండు ఆధార్‌ కేంద్రా లు పది రోజులుగా మూతపడటంతో సేవలందక వినియోగదారులకు సంబంధించి న పనులు వాయిదా పడుతున్నాయి. వి ద్యార్థులకు పరీక్షల సమయం, రైతులకు పంట రుణాలు, మాఘమాసం పెళ్లిళ్ల సీజన కావడం ఇలా అన్ని వర్గాల వారికి కీలక సమయం కావడంతో ఆధార్‌ సేవలు అం దక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. మండల కేంద్రంలో నిర్వహించే రెండు కేంద్రాల్లోనూ సాంకేతక సమస్యలు తలెత్తినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. వాటిని వీలైనంత త్వ రగా పరిష్కరించి సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఆధార్‌ కేంద్రాలను తెరిపించాలి

పది రోజులకు పైగా మూతపడిన ఆధార్‌ కేంద్రాల్లో తక్షణమే సేవలందించేలా అధికారులు చొరవ చూపాలి. ఆధార్‌ కేంద్రాల మూసివేతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రేషన కార్డుల దరఖాస్తులు, మార్పులు చేర్పుల కోసం ఆధార్‌కార్డులు అవసరం ఉంది. అవి అందక దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపి ఆధార్‌ సేవలందేలా చర్యలు తీసుకోవాలి.

చిరుమర్తి యాదయ్య, మాజీ ఎంపీటీసీ

ఈడీఎం దృష్టికి తీసుకువెళ్లా

నార్కట్‌పల్లి మండల కేంద్రంలో ఆధార్‌ కేంద్రాలు నిలిచిపోయిన సమస్యను జిల్లా ఈ-డిస్ర్టిక్ట్‌ మేనేజర్‌ (ఈడీఎం) దృష్టికి తీసుకెళ్లా. మీ సేవ కేంద్రం లాగిన లాక్‌ కావడం జరగడంతో పాటు ఆధార్‌ సేవలందించే పరికరాలు కూడా సాంకేతిక సమస్యతో సపోర్టు చేయడం లేదని తెలిపారు. త్వరగా ఆధార్‌ సేవలందేలా ప్రయత్నం చేస్తానని చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి మరోసారి తీసుకెళ్తా.

వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్‌ నార్కట్‌పల్లి

Updated Date - Mar 06 , 2025 | 11:55 PM