లారీ ఢీ కొని ద్విచక్ర వాహనాదారుడి మృతి
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:13 AM
భువనగిరి రూరల్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు.

భువనగిరి రూరల్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన భువనగిరి మం డలం అనాజీపురం బస్టాండ్ వద్ద శుక్ర వారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన భూడిద యాదగిరి (50) భువనగిరి మండలం పగిడిపల్లి రైల్వే స్టేషన్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, మార్గమధ్యలోని అనాజీపురం బస్టాండ్ వద్ద అతివేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ ఇతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యాదగిరిని 108 సిబ్బంది చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక్కడి నుంచి సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. మృతుని బావ బొల్లేపల్లి మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్ ఎస్‌హెచ్‌వో వారణాసి సంతోష్‌కుమార్ తెలిపారు.