Share News

TGSRTC: నేత్రదానానికి ఆర్టీసీ తోడ్పాటు!

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:20 AM

సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్‌ ఆర్టీసీ తోడ్పాటు అందించనుంది. సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన కార్నియాలను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయించింది.

TGSRTC: నేత్రదానానికి ఆర్టీసీ తోడ్పాటు!

  • బస్సుల్లో ఉచితంగా కార్నియాల తరలింపు

  • సరోజినీదేవి కంటి ఆస్పత్రితో ఆర్టీసీ ఒప్పందం

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్‌ ఆర్టీసీ తోడ్పాటు అందించనుంది. సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన కార్నియాలను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘నెట్‌వర్క్‌ టు సైట్‌’ పేరుతో సరోజినీదేవి కంటి ఆస్పత్రితో ఒప్పందం చేసుకుంది. మెహిదిపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మోదిని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.


ఈ సందర్భంగా సజ్జనర్‌ మాట్లాడుతూ.. పవిత్రమైన ఈ దాతృత్వ కార్యక్రమంలో ఆర్టీసీ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఏటా 3 లక్షలకుపైగా మంది నేత్రాల కోసం ఎదురుచూస్తుంటే.. కేవలం 18 వేల మార్పిడిలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. మరణాంతరం నేత్రదానం చేేసందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Sep 09 , 2025 | 04:20 AM