Share News

Dost Counseling Results: ‘దోస్త్‌’ మూడోవిడతలో 85,680 మందికి ప్రవేశాలు

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:45 AM

ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్‌ కౌన్సెలింగ్‌ మూడోవిడత ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం ప్రకటించింది.

Dost Counseling Results: ‘దోస్త్‌’ మూడోవిడతలో 85,680 మందికి ప్రవేశాలు

ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్‌ కౌన్సెలింగ్‌ మూడోవిడత ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం ప్రకటించింది. మొత్తం 96,015 మంది వెబ్‌ ఆప్షన్లు ఇవ్వగా.. 85,680 మందికి సీట్లు కేటాయించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి తెలిపారు. కామర్స్‌ కోర్సులో అత్యధికంగా 35,402 మంది, ఫిజికల్‌ సైన్స్‌లో 20,890, లైఫ్‌ సైన్స్‌లో 16,099, ఆర్ట్స్‌లో 13,128, ఇతర కోర్సుల్లో 161 మంది ప్రవేశాలు పొందినట్టు పేర్కొన్నారు. ప్రవేశాలు పొందినవారు ఈనెల 30లోపు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని, జూలై1లోపు కళాశాలల్లో చేరాలని కన్వీనర్‌ సూచించారు.

Updated Date - Jun 29 , 2025 | 04:46 AM