ట్రిపుల్ గుబులు
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:13 AM
మర్రిగూడ మండల ప్రజలకు రీజనల్ రింగ్ రోడ్డు ఫీవర్ పట్టుకుంది. కొన్ని రోజుల క్రితం పలు గ్రా మాల్లో ప్రభుత్వ అధికారులు కొత్తగా త్రిపుల్‌ఆర్ మార్కు వేయడంతో సమీప గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.

ట్రిపుల్ గుబులు
మర్రిగూడకు ట్రిపుల్ ఆర్ రోడ్డు
మార్కింగ్‌లతో రైతుల ఆందోళన
భూములు పోతాయని ఆవేదన
మర్రిగూడ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మర్రిగూడ మండల ప్రజలకు రీజనల్ రింగ్ రోడ్డు ఫీవర్ పట్టుకుంది. కొన్ని రోజుల క్రితం పలు గ్రా మాల్లో ప్రభుత్వ అధికారులు కొత్తగా త్రిపుల్‌ఆర్ మార్కు వేయడంతో సమీప గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. నలుగురు గుమికూడి న చోట ఇదే చర్చ జరుగుతోంది. గతంలో మాదిరిగానే త్రిపుల్ ఆర్ రోడ్డు మార్గం మర్రిగూడ మండల కేంద్రానికి దిగువన వెళ్లనుంది. మండలంలోని అంతంపేట, నామాపురం, మేటిచంద్రాపురం,సరంపేట, లెంకలపల్లి, తానేదార్‌పల్లి, దా మెరబీమనపల్లి మీదుగా రోడ్డు మార్గానికి సంబంధించిన గుర్తులను వేశారు. ఈ మధ్య కాలంలో గట్టుప్పల్ మండలంలోని అంతంపేట నుంచి మర్రిగూడ మండలంలోని శివన్నగూడ, సరంపే ట, తానేదార్‌పల్లి మీదుగా వట్టిపల్లి, బట్టపల్లి, మర్రిగూడ ద్వారా చింతపల్లి మండలంలోని కిష్టరాయినపల్లి బీట్ రోడ్ల గుండా త్రిపుల్ ఆర్ రోడ్డు ను నిర్మించడానికి ఈ మార్కులు వేసినట్లు తెలుస్తుంది. గతంలో వేసిన అలైనమెంట్ మారడంతో నేరుగా మర్రిగూడ మండలంలోని శివన్నగూడ నుంచి చేసిన తాజా సర్వేతో పలు గ్రామాల్లో త్రిపుల్ ఆర్ ఖరారైనట్లు స్పష్టమవుతుంది. ము ఖ్యంగా మర్రిగూడ మండలంలోని తూర్పుతండా శివారులో కొత్తగా మార్కు వేయడంతో రైతులు తన భూములు పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. త్రిపుల్‌ఆర్ రోడ్డు వేయడం వల్ల వ్యవసాయమే నమ్ముకుంటున్న రైతులకు సంబంధించిన భూములను ప్రభుత్వం తక్కువ ధరలకే విక్రయించమంటే మా పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే భూములకు రూ. కోట్లలో ధర పలుకుతుందని, ట్రిపుల్ ఆర్ రోడ్డు పనులు చేపడితే సర్వం కోల్పోతున్నామన్నారు. త్రిపుల్ రోడ్డు నిర్మా ణం చేపడితే దశ తిరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. కానీ రైతులు మాత్రం తమ భూములో కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ త్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మా ణం పలు గ్రామాల్లో చర్చనీయాంశంగా మారిం ది. ఈ విషయంపై మర్రిగూ డ తహసీల్దార్ బక్క శ్రీనివా్‌సను వివరణ కోరగా మాకు మర్రిగూడ మండలంలో త్రిపుల్ ఆర్ రో డ్డు నిర్మాణం చేపట్టడానికి మార్కింగ్ చేస్తున్న ట్లు, అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని అన్నారు. భూములకు సంబంధించిన వివరాల గురించి మాకు ఎలాంటి ఆదేశాలు లేవని తెలిపారు.