Transport Department: ’దళారుల పిన్‌కోడ్’పై విచారణ షురూ !
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:00 AM
రవాణా శాఖలో అవినీతి దందాకు కీలకంగా మారిన స్టాప్లర్ పిన్నులకు సంబంధించి ‘దళారుల పిన్ కోడ్’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో రవాణా శాఖలో కదలిక
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రవాణా శాఖలో అవినీతి దందాకు కీలకంగా మారిన స్టాప్లర్ పిన్నులకు సంబంధించి ‘దళారుల పిన్ కోడ్’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. దళారులు, అధికారులు కుమ్మక్కైన వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో రవాణా శాఖ కార్యాలయాల్లో ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని దరఖాస్తుల్ని తెప్పించుకుని ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు పరిశీలించారు.
అంతే కాదు ప్రాంతీయ, జిల్లా కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. ఇటీవల కాలంలో ఎక్కువగా అవినీతి ఆరోపణలు వస్తున్న ప్రాంతీయ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేయాలని నిర్ణయించారు.