Share News

హైకోర్టులోనే న్యాయవాదికి గుండెపోటు.. మృతి

ABN , Publish Date - Feb 19 , 2025 | 05:08 AM

హైకోర్టులో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఎండ, ట్రాఫిక్‌ కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై కోర్టులో వాదనలు వినిపిస్తుండగానే పసునూరు వేణుగోపాలరావు (66) అనే న్యాయవాది గుండెపోటుతో

హైకోర్టులోనే న్యాయవాదికి గుండెపోటు.. మృతి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): హైకోర్టులో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఎండ, ట్రాఫిక్‌ కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై కోర్టులో వాదనలు వినిపిస్తుండగానే పసునూరు వేణుగోపాలరావు (66) అనే న్యాయవాది గుండెపోటుతో కుప్పకూలిపోయారు. 21వ కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలో మంగళవారం మధ్యాహ్నం 1.12 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయనకు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం సమీపంలోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వేణుగోపాలరావు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. న్యాయవాది మృతికి సంతాపంగా న్యాయమూర్తి విచారణను నిలిపేశారు. ఇతర కోర్టుల్లో కేవలం అత్యవసర పిటిషన్‌లను మాత్రమే స్వీకరించారు.

Updated Date - Feb 19 , 2025 | 05:08 AM