Mulugu: బొగత జలపాతంలో జనసందడి
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:16 AM
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది.
వాజేడు, జూలై 6(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇక్కడ జలకళ సంతరించుకుంది. పాలనురగలా కిందకు దుంకుతున్న జలధారలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం జలపాతం వద్ద జన సందడి నెలకొంది.