TNJAC Demands Promotions: నర్సింగ్ పదోన్నతుల్లో పురుషులకు అవకాశమివ్వాలి
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:11 AM
నర్సింగ్ ఆఫీసర్స్ పదోన్నతుల్లో పురుషులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని తెలంగాణ
హైదరాబాద్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): నర్సింగ్ ఆఫీసర్స్ పదోన్నతుల్లో పురుషులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని తెలంగాణ నర్సెస్ జాయింట్ యాక్షన్ (టీఎన్‌జేఏసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. జీవో నంబరు 466, జీవో నం.101, జీవో .126లను సవరించాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జీవోలను సవరించి మహిళలు మరియూ పురుషులంటూ నర్సింగ్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు చేసిందని టీఎన్‌జేఏసీ గుర్తు చేసింది.