Share News

MLC Election : సీపీఎస్‌ సంఘం తరఫున ఇన్నారెడ్డి నామినేషన్‌

ABN , Publish Date - Feb 05 , 2025 | 04:53 AM

కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎస్‌ సంఘం తరఫున పోటీ చేస్తున్న తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎస్‌ అధ్యక్షుడు

MLC Election : సీపీఎస్‌ సంఘం తరఫున ఇన్నారెడ్డి నామినేషన్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎస్‌ సంఘం తరఫున పోటీ చేస్తున్న తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎస్‌ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, ఫిబ్రవరి 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎస్‌ సంఘం బలపరిచిన అభ్యర్థిని గెలిపించి, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న ఏకీకృత పింఛను పథకాన్ని (యూపీఎస్‌) అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ బరిలో ఉన్న ఇన్నారెడ్డి ఉపాధ్యాయ సమస్యల కోసం పని చేశారని, ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఇన్నారెడ్డి మాట్లాడుతూ, 37 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేశానని, ఉపాధ్యాయుల కష్టం తెలిసిన వ్యక్తిగా ఈ ఎన్నికల్లో తనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Feb 05 , 2025 | 04:53 AM