Three Jagtial Women Missing: మహారాష్ట్రలోని వాగులో జగిత్యాల మహిళల గల్లంతు
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:30 AM
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్ వద్ద వాగులో జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. ...
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్ వద్ద వాగులో జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుని పోగా, ఆఫ్రిన్(34), హసీనా(36), సమీనా(50) గల్లంతైనట్లు సోమవారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో జగిత్యాలలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా మహారాష్ట్రలోని ఉద్గీర్‌లో ఉండే బంధువులను కలవడానికి సమీనా మేనల్లుడు షోహెబ్‌తో కలిసి రెండు రోజుల క్రితం బయలుదేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దెగ్లూర్ వద్ద ఆదివారం సాయంత్రం వీరు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. ప్రమాదంలో కారు డ్రైవర్, వాహనంలో ప్రయాణిస్తున్న షోహెబ్ బయటపడగా అఫ్రిన్, హసీనా, సమీనాలు గల్లంతయ్యారు.