Share News

జిల్లాలో 37 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:46 AM

వన మహోత్సవంలో జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 37 లక్షలు మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణ యించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి రఘువరన్‌ పేర్కొన్నారు.

జిల్లాలో 37 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
పెగడపల్లి మండలం రాములపల్లిలో నర్సరీని పరిశీలిస్తున్న డీఆర్‌డీఓ

డీఆర్‌డీవో రఘువరన్‌

పెగడపల్లి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : వన మహోత్సవంలో జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 37 లక్షలు మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణ యించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి రఘువరన్‌ పేర్కొన్నారు. గు రువారం పెగడపల్లి మండలంలోని రాములపల్లి, వెంగళాయిపేట గ్రా మాలలో వన నర్సరీలను, పల్లె ప్రకృతి వనాలను, వైకుంఠధామాలను, కంపోస్టు షెడ్‌లను, డంపింగ్‌ యార్డులను డిఆర్‌డీవో రఘువరన్‌ సంద ర్శించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఆయా ప్రాంతాలకు అనువైన మొక్కలనే నర్సరీలలో పెంపకం చేపట్టాలని, లక్ష్యానికి సరిపడే విధంగా సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 37 లక్షలు మొక్కలు నా టేందుకు లక్ష్యం నిర్దేశించామని, అందుకు గాను 40 లక్షల మొక్కలు న ర్సరీలలో సిద్ధం చేయాలని గ్రామాల వారిగా టార్గెట్‌ కేటాయించినట్లు తె లిపారు. డిఆర్‌డీవో వెంట ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో మహేందర్‌, ఏపీవో అనీల్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 12:46 AM