Share News

ప్రశ్నించే గొంతుకలను గెలిపించాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:21 PM

పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శం కర్‌, సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌లు పేర్కొన్నారు. గురువారం మంచి ర్యాల జిల్లా కేంద్రంలోజిల్లా స్థాయి ఎమ్మెల్యే ఎన్నికల వర్కుషాపును జిల్లా అధ్యక్షుడు నగు నూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించారు.

ప్రశ్నించే గొంతుకలను గెలిపించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శం కర్‌, సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌లు పేర్కొన్నారు. గురువారం మంచి ర్యాల జిల్లా కేంద్రంలోజిల్లా స్థాయి ఎమ్మెల్యే ఎన్నికల వర్కుషాపును జిల్లా అధ్యక్షుడు నగు నూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని, ఆయనను గెలిపిస్తే ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, ఉపాధ్యాయుల పక్షాన ప్రశ్నించే గొంతుక అవు తారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అ భ్యర్థిని గెలిపించాల్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబె ల్లి, నాయకులు మల్లారెడ్డి, రమానాధ్‌, శ్యాం సుందర్‌రావు, రజనీష్‌జైన్‌, వెంకటకృష్ణ, శంకర్‌, ఏమాజీ, శ్రీదేవి, నారాయణరెడ్డి, సునీల్‌రెడ్డి, శ్రీదేవీ పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:21 PM