Share News

ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలి

ABN , Publish Date - Feb 01 , 2025 | 11:51 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీప్రకారం ప్రాణహిత ప్రాజెక్టుతో పా టు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలని వామపక్ష ఐక్యవేదిక సంఘం నాయకులు పేర్కొన్నారు.

ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలి
మాట్లాడుతున్న వామపక్ష ఐక్యవేదిక సంఘం నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీప్రకారం ప్రాణహిత ప్రాజెక్టుతో పా టు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలని వామపక్ష ఐక్యవేదిక సంఘం నాయకులు పేర్కొన్నారు. శనివారం మంచిర్యాలలోని మార్స్క్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు 2008లో అప్పటి ప్రభుత్వం శంకుస్ధాపన చేసిందన్నారు. ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి వరకు 116 కిలోమీటర్ల కోసం రూ. 1700 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. 2014లో బీఆర్‌ఎస్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీరు లేదనే సాకు చూపి రీ డిజైనింగ్‌ పేరిట మార్చారన్నారు. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టు లను పూర్తి చేయాలని ఫిబ్రవరి 2న మంచిర్యాలలో వామపక్ష ప్రజాస్వామిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వ హిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు నైనాల గోవర్ధ న్‌, లక్ష్మణ్‌, ప్రకాస్‌, లాల్‌కుమార్‌, దేవరాజ్‌, మంగ, కలిం దర్‌ ఖాన్‌, గోపినాధ్‌, మల్లన్న, రంజిత్‌, అరుణ, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 11:51 PM