చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:08 AM
చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు.

చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్
నల్లగొండరూరల్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యో తి): చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని దొ డ్డి కొమరయ్య భవనంలో శుక్రవారం నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మగ్గం పని చేసే ప్రతీ చేనేత కార్మికుడితో పాటు అనుబంధ వృత్తి కార్మికులు మరో ఇద్దరికి చేనేత పొ దుపు పథకం అమలుచేయాలని కోరారు. చేనేత మగ్గానికి అనుబంధంగా అచ్చు అతికేవారు, చిటికీ కట్టేవారు, పడుగు పోసేవారు, రంగులు అద్దేవారు, కండేలు పట్టే కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత పొదుపు పథకంలో గతంలో చేనేత కార్మికులతో పాటు మరో ఇద్దరు అనుబంధ కా ర్మికులకు వర్తింపజేసేవారని తెలిపారు. ఈ పథ కంలో ప్రతీ కార్మికుడు రూ.800 పొదుపు చేసుకుంటే రూ.1600 ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేసేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత పొదుపు పథకంలో అనుబంధ కార్మికుల పొదుపు రూ.200 తగ్గిస్తూ రూ. 600 పొదుపు చేసుకుం టే రూ. 1200 ఖాతాలో జమ చే స్తామని చెప్పడం సరికాదని అన్నారు. చేసుకునే పొదుపును తగ్గించకుండా గతంలో మాదిరిగా పొదుపు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మరియు సహకార సంఘాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ వెంటనే అమలు చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. హౌస్ కం వర్క్ షెడ్ పథకం కింద చేనేత కార్మికులకు 120 గజాల స్థలం ఇ చ్చి ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షల రూపాయ లు ఇవ్వాలని కోరారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం నూలు సబ్సిడీ 50 శాతం ఇచ్చి నగదు బదిలీ పథకం ద్వారా కార్మికుడి ఖాతాలో జమ చేయాలని కోరారు. చేనేత అనుబంధ కార్మికుల పొదుపు పథకం, రుణమాఫీ, ఇంటి నిర్మాణం, నూలు సబ్సిడీల విషయంలో చేనేత జౌళి శాఖ మంత్రి మరియు కమిషనర్ జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలని అన్నారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామ ని హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కందగట్ల గణేష్, ఉపాధ్యక్షుడు కర్నాటి శ్రీరంగం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.