మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్దపీట
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:31 PM
మందమర్రి ము న్సిపాలిటీ సమగ్ర అభివృద్దితో పాటు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపా రు.

- నియోజకవర్గానికి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి
మందమర్రి టౌన్, జనవరి 30(ఆంధ్రజ్యోతి) : మందమర్రి ము న్సిపాలిటీ సమగ్ర అభివృద్దితో పాటు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపా రు. మందమర్రిలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు పని గ ట్టుకొని తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. గత పాలన లో ఏం చేశారో చెప్పాలన్నారు. వారి అవకాశవాద రాజకీయాలతో రాష్ర్టాన్ని కోల్కోలేని విధంగా దెబ్బతీశారన్నారు. బీఆర్ ఎస్ పార్టీ చేయని కుంభకోణం లేదని ద్వజమెత్తారు. రాష్ర్టాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిపేందుకు ముఖ్యమంత్రి ఇతర రాష్ర్టాల్లో పర్య టించి పెట్టుబడులను పెద్ద ఎత్తున తీసుకురావడానికి కృషి చేస్తు న్నారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, నాయకులు సొత్కు సుదర్శన్, బండి సదానందం, గుడ్ల రమేష్, జావిద్‌ఖాన్, ఎండి ఇస్సాక్, నామిని ముత్తయ్య, పుల్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.