Share News

మాఘమాసం జాతరొచ్చింది..

ABN , Publish Date - Jan 29 , 2025 | 01:29 AM

సిరిసిల్ల మానేరు, మూలవాగు తీరాల్లో జాతర సందడి మొదలైంది. మాఘ అమావాస్య రోజున జాతర సంబురాల్లో జిల్లా ప్రజలు ఉత్సాహంగా పాల్గొననున్నారు. ఆదివారం సిరిసిల్ల మానేరు వాగులో గంగాభవాని జాతరతో పాటు మడేలేశ్వర స్వామి, రామప్ప రామలింగేశ్వరస్వామి జాతరలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మాఘమాసం జాతరొచ్చింది..
మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయం

- సిరిసిల్ల మానేరు, మూలవాగు తీరాల్లో సంబరాలు

- జిల్లా వ్యాప్తంగా జాతర సందడికి ముస్తాబు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సిరిసిల్ల మానేరు, మూలవాగు తీరాల్లో జాతర సందడి మొదలైంది. మాఘ అమావాస్య రోజున జాతర సంబురాల్లో జిల్లా ప్రజలు ఉత్సాహంగా పాల్గొననున్నారు. ఆదివారం సిరిసిల్ల మానేరు వాగులో గంగాభవాని జాతరతో పాటు మడేలేశ్వర స్వామి, రామప్ప రామలింగేశ్వరస్వామి జాతరలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొడుముంజ సమీపాన చారిత్రాత్మక క్షేత్రమైన శ్రీరామేశ్వరాలయం ఉంది. ప్రాచీన ఆలయమైన రామప్ప శిల్పసౌందర్యంతో అందరిని అకట్టుకునేది. మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ నిర్మాణంతో దేవాలయం ముంపునకు గురైంది. నాయీబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో జరిగే శ్రీరామప్ప రామలింగేశ్వస్వామి కల్యాణం జాతరను సిరిసిల్ల కరకట్ట వద్ద దేవాలయం పునర్‌నిర్మాణం జరుగుతున్నస్థలంలో జరపడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు సిరిసిల్ల మానేరు నదిలో గంగాభవాని దేవాలయం వద్ద పార్వతీపరమేశ్వరుల కల్యాణం నిర్వహిస్తారు. గంగాభవానికి ఘనంగా మహిళలు ఒడిబియ్యం సమర్పించుకుంటారు. మాఘమాసం రోజున తెల్లవార్లు జరిగే ఈ జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. మానేరు ఒడ్డున రజక సంఘం ఆధ్వర్యంలో మడేలేశ్వర స్వామి దేవాలయంలో జాతర మహోత్సవంతో పాటు కల్యాణాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు.

చిరువ్యాపారుల కోలాహలం..

మాఘమాస జాతరల వద్ద చిరు వ్యాపారుల కోలాహలం జాతర శోభను మరింత పెంచుతుంది. వివిధ ప్రాంతాలనుంచి బొమ్మలు, ఇతర వస్తువులు అమ్మకాల కోసం ప్రత్యేక దుకాణాలను ఏర్పాటుచేసుకున్నారు. సిరిసిల్ల మానేరు వాగులో ఒక రోజు ముందు నుంచే అమ్మకాలు ప్రారంభించారు. ఏటు చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది.

భక్తులకు కొంగుబంగారం సీతారామస్వామి

కోనరావుపేట : మామిడిపల్లి శ్రీసీతారాములస్వామి భక్తుల కొంగుబంగారంగా కొలుస్తారు. ఈ ఆలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయంగా కొనసాగుతోంది. అరణ్యవాసంలో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి ఈ గుట్టపైన సేదతీరాడని, రాముడి పాదముద్రలు ఇప్పటికీ కనిపిస్తాయి. అంతే కాకుండా ఈ గుట్టపైన మునులు తపస్సు చేయడం వల్ల అప్పుడు మునిపల్లెగా ఉన్న గ్రామం రానురాను మామిడిపల్లిగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య సందర్భంగా లక్షలాది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎడ్ల బండ్లతో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జాతర సందర్భంగా విగ్రహాలను, గుండ్ల పైన చిత్రాలను వేసి ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా సీతారాముల గుట్ట ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. గుట్ట ప్రాంతాన్ని రాముని పాదముద్రలు, శంకు తీర్థం, ఆంజనేయ విగ్రహం, సీతమ్మ తల్లి విగ్రహంతో పాటు భక్తులను ఆకట్టుకునే చిత్రాలతో తీర్చిదిద్దారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

జాతరకు ముస్తాబైన శ్రీలక్ష్మీకేశవ ఆలయం..

ఎల్లారెడ్డిపేట, : మండల కేంద్రం శివారులోని శ్రీలక్ష్మీకేశవ పెరుమాండ్ల ఆంజనేయస్వామి ఆలయాన్ని మాఘ అమావాస్య జాతరకు ముస్తాబు చేశారు. మండలంలోని అక్కపల్లి గ్రామ శివారులోగల బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం జాతర ఉత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిమగల దేవుడిని భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, సిరిసిల్ల, కోనరావుపేట, ముస్తాబాద్‌ తదితర మండలాల నుంచి భక్తులు తరలి రానున్నారు.

పెద్దలింగాపూర్‌ రామలింగేశ్వర స్వామి జాతర

ఇల్లంతకుంట: మండలంలోని పెద్దలింగాపూర్‌ గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో జాతర జరుగనుంది. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య సందర్భంగా ఆలయంలో జాతర కొనసాగుతుంది. ఉదయం ప్రత్యేక పూజలు, సాయంత్రం ఆలయం చట్టు బండ్ల ప్రదక్షణలు జరుగనున్నాయి. ఆలయానికి వివిద గ్రామాల భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని విధాలైన ఏర్పాట్లు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

కోర్కెలు తీర్చే అంజన్న..

ఫ గంభీరావుపేట : ఎటు చూసినా పాలరాతి బండలు.. చుట్టూ ఎత్తైన గుట్టలు.. పచ్చని పంట పొలాలు.. అపురూప రాతి కట్టడంతో చారిత్రాత్మక ప్రాధాన్యతం కలిగిన కోవెలగా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలోని శ్రీఅంజన్నస్వామి ఆలయానికి పేరుంది. శ్రీసీతారాముల ఆలయంలోపాటు శ్రీవెంకటేశ్వరస్వామి, శివాలయం కూడా ఇక్క డే ఉన్నాయి. ఈ మూడు ఆలయాలను భక్తులు దర్శించుకుని పూజలు చేసి, పలురకాల నైవేద్యాలు సమర్పిస్తారు. రామచంద్రస్వామి, అంజ న్నస్వామి ఆలయాలు అభిముఖంగా ఉండటమే కాకుండా అంజన్న కంటి కాంతికిరణాలు రాముని పాదాల్ని ఎల్లవేళలా స్పృశించేలా చేసిన ఆ కళావైభవం మహాద్భుతంగా చెప్పుకుంటారు. మల్లారెడ్డిపేట ఆంజ నేయస్వామి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. ఏటా మాఘ అమావాస్య రోజున భీమునిమల్లారెడ్డిపేట శ్రీఆంజనేయస్వామి ఆలయం వద్ద జాతర సాగుతోంది. శుక్రవారం నుంచి జరిగే అంజన్న జాతరకు రామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, దుబ్బాక, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాలనుంచి భక్తులు వస్తారు.

భక్తుల కోర్కెలు తీరుస్తాడు..

- కమలాకర్‌శర్మ, ఆలయ పూజారి, భీమునిమల్లారెడ్డిపేట

భీమునిమల్లారెడ్డిపేట అంజన్నను భక్తిశ్రద్ధలతో కొలిస్తే తప్పకుండా భక్తుల కోరికలు తీరుస్తాడు. ఏ కష్టం వచ్చిన అంజన్న ఆలయాని భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా చుట్టూ గుట్టలు,చెట్లు, నిత్యం పారే మాం డవ్య నది మధ్య స్వామివారు కొలువు దీరాడు. ఈ ఆలయానికి ఓ ప్రత్యేక ఉంది. పవిత్రమైన గుండంలో స్నానమాచరిం చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తే, ఎంతటి కోరికలైనా నెరవేరుతా యి. ప్రతిఏటా మాఘ అమావాస్య రోజున స్వామిని దర్శించుకునేందు కు చాలా దూరం నుంచి భక్తులు వేలాదిగా వస్తారు.

అంజన్న జాతరకు అన్ని ఏర్పాట్లు చేశాం..

- మణిదీప్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌, భీమునిమల్లారెడ్డిపేట

మల్లారెడ్డిపేట దేవస్థానంలో మాఘ అమావ్యా స జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు తగ్గట్టుగా ఆలయంసమీపాన సౌకర్యాలు కల్పించాం. జాతర సంధర్బంగా మల్లారెడ్డిపేటకు అదనంగా బస్స్‌ సర్వీస్‌లు పెంచే విధంగా సంభందిత అధికారులను కోరాం. అంజన్న ఆలయం వచ్చే మార్గాలను భక్తులకు వీలుగా క్లీన్‌ చేయించి, అన్ని సదుపాయా లు, ఏర్పాటు చేశాం.

Updated Date - Jan 29 , 2025 | 01:29 AM