Share News

మహిళలకు ప్రోత్సాహమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:10 PM

మహిళలను అన్ని రంగా ల్లో ప్రోత్సహించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు.

మహిళలకు ప్రోత్సాహమే ప్రభుత్వ లక్ష్యం
జిల్లా కేంద్రంలో కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి దంపతులు

- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళలను అన్ని రంగా ల్లో ప్రోత్సహించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. శని వారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి ఆయన సతీమణి డాక్టర్‌ సరితతో కలిసి కేక్‌ కట్‌ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు పలు సంక్షేమ పథకాలు ు చేస్తోందన్నారు. కూచకుళ్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యం లో వికలాంగులకు వీల్‌ చైర్‌లను ఎమ్మెల్యే దంపతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణరావు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:10 PM